పవన్ కళ్యాణ్ కోసం.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఏడేళ్ల బాలుడు

Posted By:
Hyderabad 7-Year-Old Scales Mt Kilimanjaro, Eyes World Record Next

హైదరాబాద్: ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో. టాంజానియా దేశంలో ఉన్న ఈ పర్వతాన్ని ఎక్కడం అంత సులభం కాదు. సముద్ర మట్టానికి దాదాపు 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు అధిరోహించి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన సమాన్యు పోతురాజు

ప్రపంచ రికార్డు నెలకొల్పిన సమాన్యు పోతురాజు

సమాన్యు పోతురాజు అనే ఏడేళ్ల బాలుడు ఏప్రిల్ 2న తల్లి లావణ్య, కోచ్ తమ్మినేని భరత్‌తో కలిసి ఈ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. కిలిమంజారాలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం ఉహ్రూలో త్రివర్ణణ పతాకాన్ని ఎగరేగాడు. ఈ సందర్భంగా పోతురాజు ‘ఏఎన్‌ఐ' వార్త సంస్థతో మాట్లాడాడు.

నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం

నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం

'ఆ రోజు చాలా వర్షంగా ఉంది. రోడ్డు మొత్తం రాళ్లే ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది. కాళ్లు కూడా నొప్పులు పుట్టాయి. కానీ, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ పర్వతాన్ని అధిరోహించాను. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. నేను వరల్డ్ రికార్డు పూర్తి చేస్తే అమ్మ ఆయన దగ్గరకు తీసుకెళ్తానని చెప్పింది' అని అన్నాడు.

పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఎదురు చూస్తున్నా

పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఎదురు చూస్తున్నా

'ఇప్పుడు ఆయన్ను కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నా. వచ్చే నెల ఆస్ట్రేలియాలోని మరో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి, రికార్డు సాధించేందుకు వెళ్తున్నా' అని పోతురాజు వెల్లడించాడు. పోతురాజు తల్లి లావణ్య మాట్లాడుతూ 'నా కుమారుడు వరల్డ్ రికార్డు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పారు.

రాజు మాత్రం ఎక్కడా ఆగకుండా లక్ష్యాన్ని సాధించాడు

రాజు మాత్రం ఎక్కడా ఆగకుండా లక్ష్యాన్ని సాధించాడు

'నా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను మధ్యలోనే ఆగిపోయాను. కానీ, రాజు మాత్రం ఎక్కడా ఆగకుండా లక్ష్యాన్ని సాధించాడు. అక్కడి భిన్నమైన వాతావరణానికి చాలా ఆందోళన చెందాను. మే నెలాఖరికల్లా 10 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది అతని లక్ష్యం' అని ఆమె తెలిపారు.

Story first published: Tuesday, April 17, 2018, 13:20 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి