న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth Games: చరిత్ర సృష్టించిన ఎల్దోస్ పాల్.. ట్రిపుల్ జంప్‌లో డబుల్ ట్రీట్.. గోల్డ్, సిల్వర్ మనకే

 Eldhose Paul, Abdulla Aboobacker Won Gold and Silver Medals in Commonwealth games

కామన్‌వెల్త్ క్రీడల్లో ఆదివారం భారత్‌కు పతకాల వర్షం కురుస్తోంది. కేరళకు చెందిన 25ఏళ్ల జంపర్ ఎల్దోస్ పాల్ మెన్స్ ట్రిపుల్ జంప్‌లో గోల్డ్ పతకం సాధించాడు. తద్వారా ఈ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో భారత్ 1-2తో చారిత్రాత్మక విజయం సాధించడం మరింత ప్రత్యేకం. ఈ ఈవెంట్‌లో అబ్దుల్లా అబూబకర్ రజత పతకం గెలుచుకున్నాడు. వీరిద్దరు తమ భుజాలపై భారత జెండాను చుట్టుకొని అలెగ్జాండర్ స్టేడియం చుట్టూ రన్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే గాయంతో వైదొలిగిన నీరజ్ చోప్రా స్థానంలో జావెలిన్ త్రో విభాగానికి బదులు ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డోస్ పాల్‌ను ఎంపిక చేసి బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ కు పంపించడం కలిసొచ్చింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా గైర్హాజరీని ఎల్దోస్ పాల్ గోల్డ్ మెడల్ అందించి సఫలం చేసినట్లయింది.

అంతకుముందు ఈ విభాగంలో..

ఇకపోతే ట్రిపుల్ జంప్‌లో కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు ఒక రజతం, మూడు కాంస్య పతకాలను గెలుచుకుంది. మోహిందర్ సింగ్ గిల్ 1970గేమ్స్‌లో భారతదేశానికి ఈ విభాగంలో తొలి పతకాన్ని సాధించాడు. అతను 1970లో కాంస్యాన్ని, 1974లో రజతాన్ని సాధించాడు. రెంజిత్ మహేశ్వరి 2010లో కాంస్యాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత గ్లాస్గోలో జరిగిన మెన్స్ ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్ కాంస్యం సాధించాడు. తాజాగా ఈ విభాగంలో భారత్‌కు మరో రెండుపతకాలు వచ్చాయి.

మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన

గత నెలలో యూజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు చేరుకున్న తొలి భారతీయ ట్రిపుల్ జంపర్‌గా చరిత్ర సృష్టించిన ఎల్‌దోస్ పాల్ కామన్ వెల్త్ గేమ్స్‌లో కూడా తన హవా చూపించాడు. ఈవెంట్లో అత్యుత్తమ 17.03మీటర్ల జంప్‌తో స్వర్ణం గెలుచుకున్నాడు. అదే సమయంలో అబ్దుల్లా 17.02మీటర్ల జంప్‌తో రజతం సాధించాడు. కేవలం 0.02మీటర్ల తేడాతో అతను స్వర్ణాన్ని కోల్పోయాడు. 16.99 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ జంప్‌ని కలిగి ఉన్న ఎల్‌దోస్ 14.62మీటర్ల జంప్‌తో ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలో కాస్త నిరాశ చెందాడు. రెండో ప్రయత్నంలో 16.30మీటర్లతో పుంజుకున్నాడు. అతను మూడో ప్రయత్నంలో 17.03 మీటర్లు దూకాడు. ఎల్‌దోస్ ప్రస్తుతం భారత నావికాదళంలో పనిచేస్తున్నాడు. అతను నేవీకి, దేశానికి గర్వకారణంగా నిలిచాడు.

కాంస్యం జస్ట్ మిస్సయింది

ఇక రజతం సాధించిన అబ్దుల్లా అబూబకర్ తన చివరి ప్రయత్నంలో 17.02 మీటర్లు దూకి రన్నరప్‌గా నిలిచాడు. ఇక బెర్ముడాకు చెందిన జహ్-న్హై పెరిన్‌చీఫ్ 16.92మీటర్లతో కాంస్యం గెలుచుకోగా.. భారతదేశానికి చెందిన ప్రవీణ్ చిత్రవేల్ 16.92 మీటర్ల బెస్ట్ ప్రయత్నంతో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే రౌండ్లో డిఫెరెన్స్ వల్ల ప్రవీణ్ చిత్రవేల్ కాంస్య పతకాన్ని పొందలేకపోయాడు. ఇక ట్రిపుల్ జంప్ విభాగం భారత్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో పతక ఆశలు రేపుతోంది.

Story first published: Sunday, August 7, 2022, 18:20 [IST]
Other articles published on Aug 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X