కామన్వెల్త్: స్వర్ణాన్ని ముద్దాడిన బాక్సర్ ముగ్గురి కొడుకుల తల్లి.. మేరీ కోమ్

Posted By:
CWG 2018: Mary Kom to be India’s flag-bearer at Closing Ceremony

హైదరాబాద్: ముగింపు రోజు సైతం భారత్‌కు స్వర్ణాల పరంపర దిగ్విజయంగా కొనసాగింది. ముఖ్యంగా ముగ్గురి పిల్లల తల్లి అయిన లెజెండరీ మేరీ కోమ్‌ (48 కిలోలు) స్వర్ణపతకాన్ని గెలిచి ఈ క్రీడల్లో టైటిల్‌ సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా రికార్డు నెలకొల్పింది. బాక్సింగ్ విభాగంలో మేరీ కోమ్‌తో పాటు గౌరవ్‌ సోలంకి (52 కిలోలు), వికాస్‌ క్రిషన్‌ (75 కిలోలు)లూ పసిడి పంచ్‌లు విసిరారు.

 గతం కంటే అత్యుత్తమంగా.. రెండు అదనంగా

గతం కంటే అత్యుత్తమంగా.. రెండు అదనంగా

అమిత్‌ పంగల్‌ (49 కిలోలు), మనీష్‌ కౌషిక్‌ (60 కిలోలు), సతీష్‌ కుమార్‌ (+91 కిలోలు) రజత పతకాలు చేజిక్కించుకున్నారు. ఈ క్రీడల బాక్సింగ్‌ను తొమ్మిది పతకాల (మూడు స్వర్ణ, మూడు రజత, మూడు కాంస్యాలు)తో భారత్‌ ముగించింది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో సాధించిన ఏడు పతకాల కంటే అత్యుత్తమంగా రెండు అదనంగా గెలుపొందింది.

కామన్వెల్త్‌ క్రీడల తొలి పసిడి

కామన్వెల్త్‌ క్రీడల తొలి పసిడి

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ 35 ఏళ్ల మేరీకోమ్‌ ఫైనల్‌ బౌట్‌ శనివారం నాటి బాక్సింగ్‌ పోటీలకే హైలైట్‌. నార్తర్న్‌ ఐలాండ్‌ ప్రత్యర్థి 22 ఏళ్ల క్రిస్టినా ఓ హారాను ఆమె 5-0తో చిత్తుచేసి విజేతగా నిలవడం ద్వారా తన ఖాతాలో కామన్వెల్త్‌ క్రీడల తొలి పసిడి పతకం వేసుకుంది.

మైలురాయిగా నిలిచే పతకం సొంతం చేసుకోవడం

మైలురాయిగా నిలిచే పతకం సొంతం చేసుకోవడం

‘మరోసారి చరిత్ర సృష్టించినందుకు ఆనందంగా ఉంది. కెరీర్‌లో మైలురాయిగా నిలిచే పతకం సొంతం చేసుకోవడం గర్వంగా ఉంది. ఈ విజయాన్ని నా ముగ్గురు కొడుకులకు అంకితం చేస్తున్నా' అని విజయం అనంతరం మేరీకోమ్‌ పేర్కొంది.

z ఈ కామన్వెల్త్‌లో మిగిలిన పతకాలు

z ఈ కామన్వెల్త్‌లో మిగిలిన పతకాలు

సోలంకి ఫైనల్లో నార్తర్న్‌ ఐలాండ్‌ బాక్సర్‌ బ్రెండన్‌ ఇర్విన్‌ను 4-1తో ఓడించాడు. 75 కిలోలలో వికాస్‌ క్రిషన్‌ 5-0తో కామెరూ న్‌కు చెందిన డ్యుడోనె విల్‌ఫైర్డ్‌పై విజయం సాధించాడు. 26 ఏళ్ల కిషన్‌.. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారత బాక్సర్‌గా రికార్డు సృష్టించాడు. 49 కిలోల ఫైనల్లో అమిత్‌ పంగల్‌- ఇంగ్లండ్‌ ప్రత్యర్థి యఫాయ్‌ చేతిలో పరాజయంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. అలాగే 60 కిలోల తుది పోరులో మనీష్‌ కౌషిక్‌ 2-3తో స్థానిక ఫేవరెట్‌ హారీ గార్సిడే చేతిలో, +91 కిలోల ఫైనల్లో సతీష్‌ కుమార్‌.. ఇంగ్లండ్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లార్క్‌ చేతిలో ఓటమితో రజత పతకాలు సాధించారు.

మా తుజే సలామ్.. కంగ్రాట్స్ మేరీ కోమ్

దేశం గర్వపడే ఈ బాక్సర్‌ను చూసి అభిమానులు ‘మా తుజే సలామ్' అంటున్నారు. మేరీ కోమ్‌కు అభినందనలు తెలిపిన వారిలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా ఉన్నారు. ఆయన తన శైలిలో సైకత శిల్పం ద్వారా అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం పూరీ తీరంలో మేరీ కోమ్ సైకత శిల్పాన్ని నిర్మించారు. గోల్డ్ మెడల్‌పై మేరీ కోమ్ ముఖ చిత్రాన్ని చెక్కి.. వెనుక భారత త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దారు. ఇక దానిపై ‘మా తుజే సలామ్.. కంగ్రాట్స్ మేరీ కోమ్' అని రాశారు.

Story first published: Sunday, April 15, 2018, 12:36 [IST]
Other articles published on Apr 15, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి