న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెరవేరిన స్వప్న కల: ఆడిడాస్ నుంచి ఏడు రకాల షూస్ అందజేత

Asian Games gold medallist Swapna Barman to get seven pairs of customized footwear

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా ముగిసిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన స్వప్న బర్మన్‌ ప్రత్యేక బూట్లను అందుకుంది. ప్రాక్టీస్‌కు తగిన షూస్‌ లేక స్వప్న బర్మన్ ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

స్వర్ణ విజేత స్వప్న వెనుక ద్రవిడ్.., తల్లి భావోద్వేగంస్వర్ణ విజేత స్వప్న వెనుక ద్రవిడ్.., తల్లి భావోద్వేగం

దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఆమె కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేయించి ఇచ్చేందుకు గాను ప్రముఖ బూట్ల తయారీదారు కంపెనీ ఆడిడాస్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఆమె కోసం ప్రత్యేంగా ఏడు రకాల షూస్‌ను తయారు చేయించి ఇచ్చింది.

 ఒక్కో కాలికి ఆరేసి వేళ్లతో పుట్టిన స్వప్న బర్మన్

ఒక్కో కాలికి ఆరేసి వేళ్లతో పుట్టిన స్వప్న బర్మన్

ఒక్కో కాలికి ఆరేసి వేళ్లతో పుట్టిన స్వప్న బర్మన్ తగిన బూట్లు దొరక్క తీవ్రంగా ఇబ్బందులు పడేది. అయినా కూడా పట్టుదలగా శ్రమించి ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. జకార్తా వేదికగా జరిగిన 18వ ఆసియా గేమ్స్‌లో హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అనంతరం స్వప్న బర్నన్ మాట్లాడుతూ సాధారణ బూట్లు వేసుకోవడంతో తన కాళ్లకు ఉన్న అదనపు వేళ్ళు వల్ల నొప్పి పుడుతుందని, కుదిరితే తన కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేయాల్సిందిగా అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.

ఆమె ఆభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్రీడల మంత్రి

ఆమె ఆభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్రీడల మంత్రి

ఆమె ఆభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెంటనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)ను వెంటనే ఆమెకు ప్రత్యేకమైన బూట్లను అందించాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమెకు సహాయం చేసేందుకు అడిడాస్‌ సంస్ధ ముందుకు వచ్చింది. ఆమె పాదాలపై పరిశోధన చేసి హెప్టాథ్లాన్‌లోని ఏడు ఈవెంట్లకు తగ్గట్టుగా ఏడు రకాల షూస్‌ను ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చింది.

ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన స్వప్న బర్మన్

ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన స్వప్న బర్మన్

రాజ్‌బోంగ్షీ తెగకు చెందిన దిగువ మధ్య తరగతి కంటే తక్కువస్థాయి నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఆసియా గేమ్స్‌లో స్వర్ణంతో దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. రెండు రోజులపాటు జరిగిన ఏడు క్రీడల్లో మొత్తం 6026 (కెరీర్‌ బెస్ట్‌) పాయింట్లతో హెప్టాథ్లాన్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. చిన్ననాటి నుంచి సవాళ్లకు అలవాటు పడ్డ స్వప్న బర్మన్‌.. తనేంటో చూపించడానికి ఈ హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌ను ఎంచుకుంది. పశ్చిమబంగాలోని జలపాయ్‌గురి పట్టణ సమీప ఘోసాపార అనే పల్లెటూరు ఆమె స్వస్థలం. తండ్రి పంచానన్‌ బర్మన్‌ రిక్షావాలా. తల్లి బసానా దేవి ఇంటింటా పనులు చేయడంతోపాటు తేయాకు తోటలో కూలీగా పని చేస్తోంది. వీరికి నలుగురు సంతానం.

ఆసియా గేమ్స్‌లో అద్భుతం చేసిన స్వప్న బర్మన్

ఆసియా గేమ్స్‌లో అద్భుతం చేసిన స్వప్న బర్మన్

ఏడేళ్ల కిందట తండ్రికి గుండెపోటు రావడంతో మంచానపడ్డాడు. కేవలం ఆటలోనే కాక వేరే సవాళ్లను కూడా చాలానే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా స్వప్న ఆర్థిక ఇబ్బందుల్ని, ఇతర అడ్డంకుల్ని అధిగమించి ఆటలో ఎదిగింది. ఆసియా గేమ్స్‌లో అద్భుతం చేసింది. ఆమె రెండు కాళ్లలోనూ అదనంగా ఒక్కో వేలు ఉంటుంది. మామూలు బూట్లు ధరిస్తే ఈ వేళ్ల వల్ల పరుగు తీస్తున్నపుడు, సాధన చేస్తున్నపుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎన్నో రకాలు షూలు ప్రయత్నించినా సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రత్యేకంగా షూలు డిజైన్‌ చేయించుకునే స్థోమత ఆమెకు లేదు. అయినా పాత షూటలతో ఇబ్బంది పడుతూనే అలాగే ఆసియా గేమ్స్‌కు వచ్చింది. అలాగే పోటీల్లోనూ పాల్గొని స్వర్ణ పతకం సాధించింది.

Story first published: Tuesday, November 6, 2018, 13:06 [IST]
Other articles published on Nov 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X