న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లే ఆఫ్‌లోకి బెంగాల్ వారియర్స్, ఆశలు సజీవంగా యూపీ

 Pro Kabaddi 2018, Bengal Warriors vs Patna Pirates Highlights: Bengal beat Patna to qualify for playoffs

కోల్‌కతా: ప్రొ కబడ్డీ ఆరో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టింది. సొంతగడ్డపై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి జోన్‌- బి నుంచి ప్లే ఆఫ్‌ చేరిన రెండో జట్టుగా నిలిచింది. శనివారం మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 39-23 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌ను చిత్తుచేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి బెంగాల్‌ దూకుడు కనబరిచింది. మణిందర్‌ సింగ్‌ (11) రైడింగ్‌లో వరుస పాయింట్లు తేవడంతో 11వ నిమిషంలో పట్నాను ఆలౌట్‌ చేసిన బెంగాల్‌ 13-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అదే జోరు కొనసాగిస్తూ తొలి అర్ధభాగాన్ని 18-11తో ముగించింది. విరామం తర్వాత మరింత ఆధిపత్యం చెలాయించిన బెంగాల్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 38-21తో నిలిచిన బెంగాల్‌ చివరి వరకు ఆధిక్యాన్ని నిలుపుకొని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో (58 పాయింట్లు) బెంగాల్‌ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.

హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధ 34-32తో యు ముంబాపై నెగ్గింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌ ఆశలను యూపీ సజీవంగా ఉంచుకుంది. 32-32తో సమంగా నిలిచిన సమయంలో ప్రశాంత్‌ కుమార్‌ అద్భుతమైన రైడ్‌తో యూపీ జయకేతనం ఎగురవేసింది. ముంబా రైడర్‌ రోహిత్‌ బలియాన్‌ 9 పాయింట్లు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. యూపీ జట్టులో ప్రశాంత్‌ కుమార్‌ (8), సచిన్‌ కుమార్‌ (6).. ముంబా తరపున రోహిత్‌ (9), సురేందర్‌ (4) ఆకట్టుకున్నారు.

తొలి అర్ధభాగం ముగిసే సరికి యూపీ 18-15తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్థంలో కూడా రెండు జట్లూ పాయింట్ల కోసం తీవ్రంగా పోరాడాయి. చివరి 2 నిమిషాల్లో ముంబా రైడర్‌ దర్శన్‌ కడియాన్‌ 32-32తో స్కోరు సమం చేశాడు. అయితే, ఆ తర్వాతి రైడ్‌లో ప్రశాంత్‌ రెండు పాయింట్లు తేవడంతో యూపీ నెగ్గింది.

Story first published: Sunday, December 23, 2018, 10:04 [IST]
Other articles published on Dec 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X