న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇంగ్లాండ్ మొత్తానికి సెలవు..? నిరాశపరచిన ఫుట్‌బాల్ జట్టు

FIFA 2018: Parliament Set To Debate Bank Holiday If England Win Tournament
Theresa May urged to back public holiday if England win as petition passes 200,000 signatures

హైదరాబాద్: ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరిన ఇంగ్లాండ్‌‌పై దేశ వాసులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ జట్టు ఫైనల్స్‌కు వెళ్తుందని అక్కడ కూడా కప్ గెలుస్తుందని కలలుగన్నారు. ఆదివారం తమ జట్టు కప్పు గెలవొచ్చన్న ఆలోచనతో సంబరాలకు కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్‌ గెలిస్తే సోమవారాన్ని సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరాలని తలంచారు. ఈ మేరకు సెలవు పిటిషన్‌పై లక్షా యాభైవేల మందికిపై సంతకాలు చేశారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

'ఒకవేళ ఆదివారం ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలిస్తే భారీ ఎత్తున సంబరాలు చేసుకోవాలనుకునే అభిమానులకు.. సోమవారం పనిదినంగా ఉంటే అసంతృప్తి కలగొచ్చు' అని పిటిషన్‌లో పేర్కొన్నారు. పారిస్‌లో మిన్నంటిన సంబరాలు: ఫ్రాన్స్‌ విజయంతో ఆ దేశ ప్రజల సంబరాలకు అంతే లేకుండా పోయింది. 'మేం ఫైనల్‌కు వెళ్లాం' అంటూ పాడుకుంటూ, కార్ల హారన్‌లు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ పారిస్‌ వీధుల్లో జనం కేరింతలు కొట్టారు. జాతీయ జెండాలు ఊపుతూ నృత్యాలు చేశారు.

'నా జీవితంలో అందమైన రాత్రుల్లో ఇదొకటి. ఆదివారం (ఫైనల్‌ రోజు) కూడా ఇదే అనుభవం పునరావృతమవుతుంది' అని ఓ అభిమాని వ్యాఖ్యానించాడు. ఇళ్లల్లో ఉన్నవాళ్లు కూడా బాల్కనీల్లోకి వచ్చి ఫ్రెంచ్‌ జాతీయ జెండాలను ఊపారు.

వారి ఆశలను నీరుగారుస్తూ ఇంగ్లాండ్ సెమీస్‌లోనే చేతులెత్తేసింది. సెమీస్‎లో ఇంగ్లండ్‎కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. 1966 తర్వాత రెండో సారి ఫైనల్‌ చేరాలన్న ఇంగ్లాండ్‌ కలలను క్రొయేషియా భగ్నం చేసింది. రెండు జట్లు అంచనాలు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ విజయం క్రొయేషియానే వరించింది.

Story first published: Thursday, July 12, 2018, 9:39 [IST]
Other articles published on Jul 12, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X