న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఆనందంగా ఉంది: సొంత జట్టులోకి తిరిగి సునీల్ ఛెత్రి

By Nageshwara Rao

ముంబై: ఆసియా ఫెడరేషన్ కప్ (ఎఎఫ్‌సి) టోర్నీలో బెంగళూరు ఎఫ్‌సి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి బ్రుందం తిరిగి జట్టులోకి వచ్చి చేరారని ముంబై సిటీ ఎఫ్ సి ఫ్రాంచైసీ ప్రకటించింది. ఈ నెల ఐదో తేదీన దోహాలో జరిగిన ఎఎఫ్‌సి ఫైనల్స్‌లో బెంగళూరు జట్టు ఆడిన సంగతి తెలిసిందే.

సునీల్ ఛెత్రితోపాటు ఉదాంతా సింగ్, అమరీందర్ సింగ్, లాల్ఛౌన్మావాయిదా ఫనాయి తమ సొంత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తారు. ఎఎఫ్ సి కప్ టోర్నీలో భారత క్లబ్ జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన ఘనత గల సునీల్ ఛెత్రి భారత జాతీయ జట్టు సారధి కూడా. అయినా ప్రస్తుతం కొనసాగుతున్న ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టోర్నీలో నోర్డె, పోర్లాన్ తదితరులతో కలిసి ముంబై సిటీ ఎఫ్ సి తరుఫున మ్యాచ్ ల్లో పాల్గొననున్నాడు.

సునీల్ ఛెత్రి తదితరుల రాకపై ముంబై సిటీ హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ స్పందిస్తూ 'మాతో సునీల్ ఛెత్రి, అమరీందర్, ఫనాయి భాగస్వాములు కావడం మాకు ఆనందంగా ఉంది. బెంగళూరు ఎఫ్ సితో కలిసి వారు అద్భుతమైన ప్రయాణం సాగించారు. వారి సాదించిన విజయాలు అత్యుత్తమమైనవి, వారి ఆటతీరులో నాణ్యత, ఫలితాలు సాధించాలన్న ఆర్తి కసి వారిలో ఉన్నది' అని అన్నాడు.

వారి రాకతో తమ జట్టుకు గొప్ప ఫ్లస్ పాయింట్ అని అన్నారు. మొత్తం జట్టుకు బూస్ట్ వంటిదన్నాడు. తిరిగి ముంబై సిటీ ఎఫ్ సిలోకి రాకపై సునీల్ ఛెత్రి స్పందిస్తూ 'మేం బెంగళూరు ఎఫ్ సితో తిరుగులేని అనుభవం సంపాదించాం. ఇక ఇప్పట్నించి మా సహజమైన టోర్నమెంట్ ఐఎస్ఎల్ లో భాగస్వామి కావాలని ఆసక్తితో ఉన్నాం' అని తెలిపాడు.

ISL: Sunil, Udanta, Amrinder, Fanai back in Mumbai City FC squad

'ప్రస్తుత సీజన్ లో ముంబై సిటీ ఎఫ్ సి సాధిస్తున్న ప్రగతి, విజయాలను అనుసరిస్తున్నాం. మొత్తం టీం అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది. జట్టులో చేరేందుకు మేమే మాత్రం ఆలస్యం చేయబోం. ఈ ఏడాది టోర్నీ ముగిసే నాటికి ముంబై అభిమానులకు సత్ఫలితాలను అందించగలమని భావిస్తున్నాం' అని ఛెత్రి వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్స్ గా నిలిచిన ముంబై సిటీ జట్టు గురువారం ముంబైలో పుణె సిటీతో తలపడుతుంది.

డైనమోస్ రోచాపై మొహున్ కన్ను
కోల్‌కతా: ఐ-లీగ్ మాజీ చాంపియన్ మొహున్ బగన్ క్లబ్ యాజమాన్యం, ఐఎస్ఎల్ టోర్నీ ఫ్రాంచైసీ ఢిల్లీ డైనమోస్ కుర్రాడు డిఫెండర్ రుబెన్ గొంజాలెజ్ రోచాతో కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం చెన్నైయిన్ ఎఫ్‌సి తరఫున ఆడుతూ గాయపడిన ధనచంద్ర సింగ్ లేమితో మొహున్ బగన్ జట్టు అష్టకష్టాలు పడుతున్నది.

ఇంతకుముందు ధనచంద్ర సింగ్, ఐ-లీగ్లో మొహున్ బగన్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ నుంచి ఐ-లీగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా ఈ దఫా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా మొహున్ బగన్ హెడ్ కోచ్ సంజయ్ సేన్.. రోచా కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రియల్ మాడ్రిడ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రోచా.. బొరుస్సియా, మాంచెంగ్లాడ్ బాచ్, స్పెయిన్లో అల్బాసెటె తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

రొనాల్డో ముందు తర్వాత రియల్ మాడ్రిడ్ దే చరిత్ర
క్రిస్టియానో రొనాల్డో చేరికకు ముందు తర్వాత కూడా తమ జట్టు చరిత్ర నెలకొల్పుతుందని రియల్ మాడ్రిడ్ జట్టు ఫ్రాంచైసీ క్లబ్ అధ్యఓుడు ఫ్లొరెంటినో పెరెస్ వ్యాఖ్యానించారు. రొనాల్డోతో కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఆయన స్పందిస్తూ సమయానుకూలంగా కాంట్రాక్ట్ పొడిగించినందుకు క్రిస్టియానోను పొగడ్తల్లో ముంచెత్తాడు.

'ఇటువంటి పురాతన మ్యాచ్‌ల్లో చరిత్ర నెలకొల్పాలంటే మీకు మంచి సక్సెస్సర్ కావాలి. క్రిస్టియానో రొనాల్డోకు ముందు తర్వాత రియల్ మాడ్రిడ్ రికార్డులు నెలకొల్పుతుంది' అని అన్నాడు. తన వారసత్వాన్ని యథాతథంగా కొనసాగిస్తుందన్నాడు. స్పానిష్ లీగ్ 'లా లీగ'లో లెజెండ్ గా నిలిచిన రియల్ మాడ్రిడ్‌లో రొనాల్డో టాప్ స్కోరర్. పలు విజయాలు, టైటిళ్లను సాధిస్తూ ముందుకు వెళుతున్న రొనాల్డొను ఏ ఒక్కరూ మరిచిపోలేరన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X