ఫిఫా వరల్డ్ కప్: భారత్ పుట్‌బాల్ చరిత్రలోనే తొలి గోల్ (ఫోటోలు)

Posted By:

హైదరాబాద్: భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో భాగంగా కొలంబియాతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఫరవాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో భారత్ పుట్‌బాల్ జట్టు విజయం సాధించకపోయినా, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలి గోల్‌ను నమోదు చేసింది.

తొలి మ్యాచ్‌లో అమెరికాపై ఫరవాలేదనిపించిన భారత్ కొలంబియాతో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ యువ ఫుట్‌బాలర్లు చివరి వరకు పోరాడారు. ఈ మ్యాచ్‌లో రెండో అర్ధ భాగం వరకూ ఆ జట్టును గోల్‌ చేయకుండా నిలువరించారు. 51వ నిమిషందాకా కొలంబియా తొలి గోల్‌ చేయలేకపోయింది.

ఒక దశలో మ్యాచ్ ను డ్రాగా ముగిస్తుందనేంత వరకూ వచ్చి భారత అండర్-17 జట్టు చరిత్ర సృష్టించేలా కనిపించింది. అయితే పటిష్టమైన కొలంబియా జట్టు రెండో గోల్‌ను కూడా కొట్టేసి.. మ్యాచ్‌ను తమవైపు తిప్పకుని 2-1తో విజయం సాధించింది. గ్రూప్‌ ఎ-లో భారత పుట్‌బాల్ జట్టుకిది రెండో ఓటమి.

 నాలుగు మార్పులతో రెండో మ్యాచ్ బరిలోకి

నాలుగు మార్పులతో రెండో మ్యాచ్ బరిలోకి

తొలి మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు అమెరికా జట్టు చేతిలో 3-0తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లోని తప్పొప్పులను సమీక్షించుకుని రెండో మ్యాచ్‌లో అద్భుతమైన వ్యూహాలు రూపొందించుకొని వాటిని అక్షరాలా ఆచరించారు. నాలుగు మార్పులతో భారత్‌ ఈ మ్యాచ్‌ బరి లో దిగింది. అభిమానులు ప్రోత్సహిస్తున్న వేళ తొలి నిమిషం నుంచే భారత కుర్రాళ్లు సత్తా చాటారు. భారత్ కంటే పటిష్టమైన, మెరుగైన స్థితిలో ఉన్న జట్టు కొలంబియా. అంతర్జాతీయ స్థాయి సాకర్ స్టార్లకు పుట్టినిల్లు కొలంబియా. అలాంటి దేశపు కుర్రాళ్లతో సాకర్‌లో పసికూన అయిన భారత్ తలపడింది. మ్యాచ్ ఫలితం ముందుగా ఊహించదగినదే అయినా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చింది.

 16వ నిమిషంలోనే భారత్‌కు గోల్‌ చేసే అవకాశం

16వ నిమిషంలోనే భారత్‌కు గోల్‌ చేసే అవకాశం

ఈనేపథ్యంలో 16వ నిమిషంలోనే భారత్‌కు గోల్‌ చేసే అవకాశం వచ్చింది. అయితే అభిజిత్‌ కొట్టిన షాట్‌ కొద్దిలో గతి తప్పింది. అయినా.. భారత్‌ నిరుత్సాహపడలేదు. తమకంటే ఎన్నో రెట్లు మెరుగైన కొలంబియాను నివ్వెర పరస్తూ గోల్స్‌ అవ కాశాలను సృష్టించుకొనేందుకు యత్నించింది. అవి ఫలించి భారత్‌కు మరో ఛాన్స్‌ లభించినా రాహుల్‌ కనోలిస్‌ కొట్టి న వాలీ గోల్‌పోస్ట్‌ మీదుగా దూసుకు పోయింది. మరో మారు సువర్ణావకాశం చేజారడంతో భారత్‌ కోచ్‌ డీ మాటోస్‌ ఒకింత నిరుత్సాహానికి లోనయ్యాడు. మరోవైపు అదే ఆటతీరు కనబరిచిన భారత్‌.. ప్రత్యర్థికి గోల్‌ ఇవ్వకుండా తొలి అర్ధభాగాన్ని ముగించింది.

 తొలి గోల్ చేసిన కొలంబియా

తొలి గోల్ చేసిన కొలంబియా

చివరకు 51వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్‌ పెనలోజ డీబాక్స్‌ అంచున బంతిని దొరకబుచ్చుకొని భారత్‌ డిఫెండర్లను తప్పించుకొంటూ వెళ్లి ఎడమ కాలితో కొట్టిన వాలీ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. దీంతో తొలి గోల్ కొలంబియానే చేసింది. 1-0తో లీడ్ లో ఉండగా 82వ నిమిషయంలో భారత్ తరఫున మిడ్ ఫీల్డర్ జీక్సన్ సింగ్ తొలి గోల్ నమోదు చేసి.. చరిత్ర సృష్టించాడు. స్కోర్ 1-1 గా సమం అయిన సమయంలో 83 వ నిమిషంలో కొలంబియా ఆటగాడు జువాన్ పెనలోజా రెండో గోల్ కొట్టాడు. దీంతో 2-1తో కొలంబియా విజయం సాధించింది.

 తొలి మ్యాచ్‌తో పోలిస్తే భారత అద్భుత్ ప్రదర్శన

తొలి మ్యాచ్‌తో పోలిస్తే భారత అద్భుత్ ప్రదర్శన

అయితే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికి ఒక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తొలి గోల్ ను నమోదు చేసుకోవడంతో పాటు.. కొలంబియా జట్టుకు ఫుల్‌ఫైట్ ను ఇవ్వడంలో భారత జట్టు విజయవంతం అయ్యింది. తొలి మ్యాచ్‌తో పోలిస్తే భారత పుట్‌బాల్ జట్టు మరింత మెరుగైన ఆటతీరును కనబరిచింది.

 ఘనాపై అమెరికా ఘన విజయం

ఘనాపై అమెరికా ఘన విజయం

అంతకుముందు జరిగిన గ్రూప్‌-ఎలో అమెరికా 1-0తో ఘనాపై విజయం సాధించి రౌండ్‌ 16లో ప్రవేశించింది. సబ్‌స్టిట్యూట్‌ అయో అకినోలా 75వ నిమిషంలో ఈ గోల్‌ చేశాడు. ఈ గ్రూప్‌లో అమెరికాకిది రెండో విజయం కావడం విశేషం. ఇక, ముంబైలో జరిగిన గ్రూప్‌-బి పోరులో ఆఫ్రికన్‌ చాంపియన్‌ మాలి 3-0తో టర్కీని ఓడించింది. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో పరాగ్వే 4-2తో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.

Story first published: Tuesday, October 10, 2017, 11:23 [IST]
Other articles published on Oct 10, 2017
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి