న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీభాయ్‌ నాకు సమస్య పరిష్కారిగా కనిపిస్తాడు.. నాతో ఎందరినో ఔట్ చేయించాడు: చహల్‌

Yuzvendra Chahal says MS Dhoni is a problem solver for Kuldeep Yadhav and me

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తనకు సమస్య పరిష్కారిగా కనిపిస్తాడు అని భారత మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ పేర్కొన్నాడు. బ్యాట్స్‌మెన్‌ తన బౌలింగ్‌లో బౌండరీలు కొడుతుంటే ఏం చేయాలో తోచని సమయంలో మహీ వైపు చూస్తే.. నా బాడీ లాంగ్వేజ్ చూసి అర్ధం చేసుకుని సలహాలు ఇచ్చేవాడని చహల్‌ తెలిపాడు. మహీ తన సలహాలతో ఎందరినో తనంతో ఔట్ చేయించాడని చెప్పాడు. ధోనీ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని కితాబిచ్చాడు.

స్టోక్స్ తొలి బంతి నుంచే మొదలెట్టాడు.. నన్ను రెచ్చగొట్టేందుకు ఎంతో ప్రయత్నించాడు: బ్లాక్​వుడ్స్టోక్స్ తొలి బంతి నుంచే మొదలెట్టాడు.. నన్ను రెచ్చగొట్టేందుకు ఎంతో ప్రయత్నించాడు: బ్లాక్​వుడ్

ఇస్‌కో గూగ్లీ దాల్:

ఇస్‌కో గూగ్లీ దాల్:

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ మాట్లాడుతూ... 'టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో మహీభాయ్‌ ఒకడు. అతడు నాకు, కుల్దీప్‌కు చాలా సాయం చేశాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్‌ నా బౌలింగ్‌లో బౌండరీలు కొడుతుంటే.. నాకు ఏం చేయాలో తోచేది కాదు. అప్పుడు ధోనీ వైపు చూస్తే.. నన్ను అర్ధం చేసుకునేవాడు. నా దగ్గరికి వచ్చి 'ఇస్‌కో గూగ్లీ దాల్‌.. ఏ నహీ ఖేల్‌సకేగా' (ఇతడికి గూగ్లీ వేయి.. ఆ బంతిని ఆడలేడు)అని చెప్పేవాడు. మహీ సలహాలు ఆటను సులభతరం చేస్తాయి. వికెట్ల వెనకాల ఉండి బ్యాట్స్‌మన్‌ ఎలా ఆడుతాడో నిత్యం గమనిస్తూ ఉంటాడు' అని చహల్‌ తెలిపాడు.

ఇస్‌కో స్టంప్‌ టు స్టంప్‌ దాల్:

ఇస్‌కో స్టంప్‌ టు స్టంప్‌ దాల్:

'సలహాల కోసం మహీ వంక చూడడం ఇలా చాలాసార్లే జరిగింది. దక్షిణాఫ్రికాలో మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు జేపీ డుమిని బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను అతడిని ఔట్‌ చేయాలనుకుంటుండగా.. మహీభాయ్‌ నా దగ్గరికి వచ్చి 'ఇస్‌కో స్టంప్‌ టు స్టంప్‌ దాల్‌ (ఇతడికి స్ట్రెయిట్‌గా బౌలింగ్‌ వేయి) అని చెప్పాడు. అలానే బౌలింగ్‌ చేయగా.. డుమిని దాన్ని స్కిప్‌ చేయబోయి ఎల్‌బీ అయ్యాడు' అని చహల్‌ చెప్పాడు.

లైన్ చేంజ్ మత్‌ కర్నా:

లైన్ చేంజ్ మత్‌ కర్నా:

'న్యూజిలాండ్‌లో టామ్ లాథమ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నా బౌలింగ్‌లో స్వీప్‌ షాట్లు ఆడుతుంటే.. నేను గూగ్లీస్‌, లెగ్ స్పిన్‌లు సంధించాను. అతను వాటిని బౌండరీలు బాదాడు. నేను చాలా నిరాశ చెందాను. అప్పుడు మహీభాయ్‌ 'లైన్ చేంజ్ మత్‌ కర్నా.. ఇస్కో ఆగే దాల్ అవుర్‌ స్టంప్‌ పే రఖ్నా' ( లైన్‌ మార్చకు.. బంతిని మాత్రం అతడి వైపుకు పిచ్ చేసి స్టంప్స్‌ వైపుగా వేయి) అన్నాడు. ఆ తరువాతి బంతికి లాథమ్‌ పెవిలియన్ చేరాడు. ఆ వికెట్‌ తరువాత నేను మహీ భాయ్‌ను కౌలిగించుకున్నా' అని 29 ఏళ్ల స్పిన్నర్‌ అన్నాడు.

రిటైర్మెంట్ మహీ సొంత నిర్ణయం:

రిటైర్మెంట్ మహీ సొంత నిర్ణయం:

'మహీభాయ్‌కి రిటైర్మెంట్ విషయంలో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ధోనీ మాత్రం స్పదించలేదు. అయితే మహీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని నేను నమ్ముతున్నా. ఐపీఎల్ కోసం గత మార్చిలో చెన్నైలో ప్రాక్టీస్ చేశాడు. బంతిని బలంగా బాదాడు. ఫిట్‌నెస్‌ బాగుంది. ఆయన పునరాగమనం మనకు చాలా మంచిది. కానీ రిటైర్మెంట్ అతడి సొంత నిర్ణయం' అని యజువేంద్ర చహల్‌ చెప్పుకొచ్చాడు. చహల్‌ భారత్ తరఫున 52 వన్డేలు, 42 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Wednesday, July 15, 2020, 21:32 [IST]
Other articles published on Jul 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X