న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ చెత్త రికార్డు: ఈ సారైనా సవరించేనా?

World Cup head to head: Sri Lanka have beaten Bangladesh in all 3 encounters

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. జూన్ 11వ తేదీన బ్రిస్టల్ వేదికగా మాజీ వరల్డ్‌కప్ విజేత శ్రీలంక... బంగ్లాదేశ్‌తో తలపడనుంది. వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక మెరుగైన రికార్డుని కలిగి ఉండటం విశేషం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

వన్డేల్లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 36-7 ఆధిక్యాన్ని కలిగి ఉండగా... రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం తేలలేదు. చివరగా బంగ్లాదేశ్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో శ్రీలంక 3-2తో విజయం సాధించింది. ఇక, వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక ఘన విజయం సాధించింది. 2003 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ తన తొలి వన్డే వరల్డ్‌కప్ ఆడింది.

అప్పటి నుంచి 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 11వ ఎడిషన్ వరకు శ్రీలంకతో మూడు సార్లు తలపడిన బంగ్లాదేశ్ మూడు సార్లు ఓడిపోయింది. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

కనీసం ఈ వరల్డ్‌క‌ప్‌లోనైనా విజయం సాధిస్తుందో లేదో చూడాలి...:

గ్రూప్ స్టేజి: బంగ్లాపై 10 వికెట్ల తేడాతో లంక విజయం (Feb 14, 2003)

గ్రూప్ స్టేజి: బంగ్లాపై 10 వికెట్ల తేడాతో లంక విజయం (Feb 14, 2003)

2003 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తొలిసారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ సనత్ జయసూర్య బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లంక పేసర్ చిమిందా వాస్ తొలి మూడు బంతుల్లోనే మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. బంగ్లా జట్టులో అలోక్ కపాలి 32 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చిమిందా వాస్ (6/25)కి తోడు ముత్తయ్య మురళీధరన్ 3 వికెట్లతో చెలరేగగా బంగ్లాదేశ్ 31.1 ఓవర్లలోనే 124 పరుగులకే ఆలౌటైంది. ఆనంతరం లక్ష్య చేధనలో లంక ఓపెనర్లు మర్వన్ ఆటపట్టు, జయసూర్య హాఫ్ సెంచరీలను నమోదు చేయడంతో శ్రీలంక ఘన విజయం సాధించింది.

గ్రూప్ స్టేజి: బంగ్లాపై 198 పరుగులు తేడాతో లంక విజయం (March 21, 2007)

గ్రూప్ స్టేజి: బంగ్లాపై 198 పరుగులు తేడాతో లంక విజయం (March 21, 2007)

ఈ టోర్నీలో బంగ్లా తన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మహిళా జయవర్దనే నాయకత్వంలోని శ్రీలంక చేతిలో మాత్రం ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ హబిబుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో జయసూర్య(87బంతుల్లో 109) సెంచరీతో చెలరేగా... కుమార సంగక్కర(56), చమర సిల్వా(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 4 318 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో వర్షం కారణంగా బంగ్లాదేశ్‌కు 46 ఓవర్లకు 311 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, బంగ్లాదేశ్ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. మలింగ మూడు వికెట్లు తీశాడు. జయసూర్యకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

గ్రూప్ స్టేజి: బంగ్లాపై 92 పరుగుల తేడాతో లంక విజయం (Feb 26, 2015)

గ్రూప్ స్టేజి: బంగ్లాపై 92 పరుగుల తేడాతో లంక విజయం (Feb 26, 2015)

మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్(146 బంతుల్లో 161 నాటౌట్), కుమార సంగక్కర(76 బంతుల్లో 105 నాటౌట్) సెంచరీలు సాధించారు. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 332 పరుగులు చేసింది. అనంతరం చేధనలో బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ మ్యాచ్‌లో శ్రీలంక 92 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Friday, May 24, 2019, 14:19 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X