న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు కారణాలు: టీమిండియా చేతిలో న్యూజిలాండ్ ఓడటం ఖాయం!

ICC Cricket World Cup 2019 : Ind vs NZ : Three Reasons Why India Will Defeat NZ In The Semi-Final
World Cup 2019: Three reasons why India will defeat New Zealand in the semi-final

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో లీగ్ స్టేజిని విజయంతో ముగించి పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క ఇంగ్లాండ్‌ తప్పించి లీగ్ స్టేజిలో ఆడిన ప్రతి జట్టుపై కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దు అయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో భాగంగా లీగ్ స్టేజిలో ఏ న్యూజిలాండ్‌తో అయితే మ్యాచ్ ఆడలేదో అదే జట్టుతో ఇప్పుడు కోహ్లీసేన తొలి సెమీఫైనల్లో తలపడుతుండటం విశేషం. జులై 9న ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. క్రికెట్ విశ్లేషకులు మాత్రం వార్మప్ మ్యాచ్‌ని గుర్తు చేస్తున్నారు.

టోర్నీలో భాగంగా లీగ్ స్టేజిలో న్యూజిలాండ్ ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. మరోవైపు టీమిండియా విషయానికి వస్తే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి లీగ్ స్టేజిని ఘనంగా ముగించింది. ఈ నేపథ్యంలో తొలి సెమీఫైనల్లో కివీస్‌ను కోహ్లీసేన ఓడిస్తుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గ కారణాలను కూడా వెల్లడిస్తున్నారు.

ఇండియా టాపార్డర్ - చైనామన్ స్పిన్నర్లు

ఇండియా టాపార్డర్ - చైనామన్ స్పిన్నర్లు

ఈ ప్రపంచకప్‌లో టీమిండియా టాపార్డర్‌తో పాటు చైనామన్ స్పిన్నర్లు ప్రత్యర్ధి జట్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. టాపార్డర్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ ముగ్గురూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో ఈ ముగ్గురూ నిలకడగా ఆడుతూ పరుగుల పరద పారిస్తున్నారు. ఈ ముగ్గురూ కివీస్‌తో జరిగే తొలి సెమీస్‌లో రాణిస్తే విజయం కోహ్లీసేనదేనని అంటున్నారు.

భారత పేస్ బౌలింగ దళానికి నాయకత్వం వహిస్తోన్న జస్ప్రీత్ బుమ్రాకు తోడు ఈ ప్రపంచకప్‌లో చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా కివీస్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను ఆడటంలో సిద్ధహస్తులు కారు. దీంతో తొలి సెమీఫైనల్లో కోహ్లీ వీరికి ప్రయోగించే అవకాశం ఉంది.

పేలవ ప్రదర్శన చేస్తోన్న న్యూజిలాండ్ ఓపెనర్లు

పేలవ ప్రదర్శన చేస్తోన్న న్యూజిలాండ్ ఓపెనర్లు

ఈ ప్రపంచకప్‌లో కివీస్ ఓపెనర్ల పేలవ ప్రదర్శన ఆ జట్టును బాధిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ మార్టిన్ గుప్టిల్-కొలిన్ మున్రోలు సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. ఈ ప్రపంచకప్‌లో చెత్త యావరేజిని కలిగిన ఓపెనర్లు ఎవరైనా ఉన్నారంటే అది న్యూజిలాండే. న్యూజిలాండ్ ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో ఓటమికి కారణం ఆ జట్టు ఓపెనర్ల పేలవ ప్రదర్శనే. ఇక, టోర్నీలోనే బెస్ట్ బౌలర్లుగా కొనసాగుతున్న బుమ్రా, షమీ, చాహుల్, కుల్దీప్‌లను కివీస్ ఓపెనర్లు ఏ మేరకు ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.

న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన

న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన

లీగ్ స్టేజి ఆఖరి దశలో న్యూజిలాండ్ వరుస ఓటములను ఫేస్ చేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల చేతిలో ఓడటం ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఏదో రన్ రేట్ మెరుగ్గా ఉండటబట్టి టాప్-4లో నిలిచింది లేకుంటే టోర్నీ నుంచి నిష్క్రమించేదే. గత పది రోజుల్లో మూడు ఓటములు న్యూజిలాండ్ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని కూడా క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ప్రపంచకప్ సెమీపైనల్స్‌లో న్యూజిలాండ్‌కు ఏమంత గొప్ప మెరుగైన రికార్డు కూడా లేదు. దీంతో టీమిండియా చేతిలో న్యూజిలాండ్‌కు ఓటమితప్పదని అంటున్నారు.

1
43689

{headtohead_cricket_3_4}

Story first published: Monday, July 8, 2019, 15:39 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X