న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'న్యూజిలాండ్‌లాగే పాక్‌ను సైతం చిత్తు చేస్తాం'

Womens World T20: Smriti Mandhana Says India Have Done Their Research On Pakistan Team

హైదరాబాద్: న్యూజిలాండ్‌పై ఘనవిజయంతో టీ20 ప్రపంచకప్‌ను ఆరంభించిన భారత మహిళల జట్టు.. ఒక్క రోజు వ్యవధిలో తన తర్వాతి పోరుకు సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్‌ ఢీకొనబోతోంది. తొలి పోరులో హర్మన్‌ ప్రీత్‌ మెరుపు సెంచరీ అభిమానుల్ని ఉర్రూతలూగించింది. పురుషుల ఆటకు ఏమాత్రం తగ్గని వినోదాన్ని పంచింది ఆమె బ్యాటింగ్‌. ఈ మ్యాచ్‌ తర్వాత ఆదివారం రోజు పాకిస్థాన్‌తో పోరనే సరికి ఆసక్తి రెట్టింపైంది. ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌ అనడంలో సందేహమే లేదు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగిస్తామని స్మృతి

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగిస్తామని స్మృతి

ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై చేసిన ప్రదర్శననే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగిస్తామని ఓపెనర్‌ స్మృతి మంధాన అన్నారు. పాక్‌ జట్టుపై ఇప్పటికే పూర్తిస్థాయిలో పరిశోధన చేశాం... ఈ క్రమంలో ఆదివారం మ్యాచ్‌లో వాటిని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంధాన పేర్కొంది.

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 34పరుగులతో

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 34పరుగులతో

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 34పరుగుల తేడాతో భారత్‌ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు పరుగులకే పరిమితమైన మంధాన.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది.

మ్యాచ్‌లో నా వంతుగా 100శాతం

మ్యాచ్‌లో నా వంతుగా 100శాతం

దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌లో నా వంతుగా 100శాతం ప్రదర్శన ఇవ్వడానికే నేను ప్రయత్నిస్తాను. ఎప్పటికీ నా లక్ష్యం కూడా అదే. ఒకవేళ నా పై ఉన్న అంచనాల గురించి ఆలోచిస్తే వాటిని అందుకోవడంలో విఫలమవుతాను. నా వరకు ఒత్తిడికి గురి కాకుండా ఆటను ఆస్వాదించడానికే ప్రయత్నిస్తాను.' అని చెప్పుకొచ్చింది.

బౌలర్లు చక్కగా రాణించి 160పరుగులకే

బౌలర్లు చక్కగా రాణించి 160పరుగులకే

‘న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మా బౌలర్లు చక్కగా రాణించి 160పరుగులకే కట్టడి చేశారు. తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తున్నట్లు మంధాన తెలిపింది. రెండేళ్ల కిందటి వన్డే ప్రపంచకప్‌ దగ్గర్నుంచి అమ్మాయిల ఆటను అభిమానులు బాగానే అనుసరిస్తున్నారు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌పై అభిమానులు ప్రత్యేక ఆసక్తితో ఉండగా.. తొలి పోరు అంచనాలకు తగ్గట్లే సాగడంతో పాకిస్థాన్‌తో పోరుకు ముందు ఆసక్తి రెట్టింపైంది.

Story first published: Sunday, November 11, 2018, 16:40 [IST]
Other articles published on Nov 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X