న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ అధికారిక ప్రకటన వచ్చేసింది.. మే 23నుంచి మహిళల టీ20 ఛాలెంజ్

Women’s T20 Challenge : BCCI Announces squads and shcedules

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కీలక అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్లో మూడు జట్ల మహిళల టీ20ఛాలెంజ్ కోసం జట్లను, షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్ చివరిగా 2020లో జరిగింది. కోవిడ్-19 పరిమితుల కారణంగా గత సంవత్సరం మహిళల టీ20 టోర్నీ జరగలేదు. ఈవెంట్ నాలుగో సీజన్ మే 23న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్‌బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.

ఈసారి మిథాలీ రాజ్ లేకుండా

ఈసారి మిథాలీ రాజ్ లేకుండా

ఇక ఈ టీ20 ఛాలెంజ్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్‌నోవాస్‌కు నాయకత్వం వహిస్తుండగా, ట్రైల్‌బ్లేజర్స్‌కు మళ్లీ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మునుపటి ఎడిషన్ వరకు మిథాలీ రాజ్ వెలాసిటీ జట్టుకు కెప్టెన్‌గా ఉండగా.. ఈసారి మిథాలీ రాజ్ అందుబాటులో లేదు. దీంతో వెలాసిటీ జట్టుకు ఆల్ రౌండర్ దీప్తి శర్మ నాయకత్వం వహించనుంది. ముఖ్యంగా 2020లో ఛాంపియన్స్ టీమ్ ట్రైల్‌బ్లేజర్స్‌లో భాగమైన ఝులన్ గోస్వామి, శిఖా పాండే ఈ ఏడాది ఆడట్లేదు.

ఒక్కొక్క జట్టులో 16మంది ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ

ఈ టోర్నీ గురించి ప్రకటన చేసిన బీసీసీఐ.. 'భారత మహిళా క్రికెట్‌లోని అత్యుత్తమ ప్లేయర్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ప్రముఖ ప్లేయర్లతో కలిసి జట్లు ఏర్పడ్డాయి. ఈ ఏడాది మహిళల టీ20 ఛాలెంజ్‌లో మొత్తం పన్నెండు మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఆడుతున్నారు.' అని బీసీసీఐ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈమేరకు ఒక్కొక్క జట్టులో 16మంది ప్లేయర్లతో కూడిన మూడు జట్లను ఆల్-ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

ఏ రోజు ఏ మ్యాచ్ జరుగుతుందంటే

మే 23న మహిళల టీ20 ఛాలెంజ్‌లో మొదటి మ్యాచ్‌ ట్రైల్‌బ్లేజర్స్ వర్సెస్ సూపర్‌నోవాస్ మధ్య జరుగుతుంది. మే24న సూపర్‌నోవాస్, వెలాసిటీ తలపడతాయి. ఆ తర్వాత మే 26న ట్రైల్‌బ్లేజర్స్‌తో వెలాసిటీ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌లో టాప్ 2 ప్లేస్‌లో నిలిచిన మొదటి రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.

ఏ జట్టులో ఎవరున్నారంటే

సూపర్ నోవాస్ : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), తనియా భటియా (వైస్ కెప్టెన్), అలానా కింగ్, ఆయుష్ సోనీ, చందు వీ, దీయాంద్ర దత్తీన్, హర్లీన్ డియోల్, మేఘన సింగ్, మోనికా పటేల్, ముక్సాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రషీ కనోజియా, సోఫీ ఎక్లేస్టోన్, సునే లూజ్, మన్షీ జోషీ,

ట్రైల్ బ్లేజర్స్ : మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్ (వైస్ కెప్టెన్), అరుంధతీ రెడ్డి, హయల్లీ మాథ్యుస్, జెమిమీయా రోడ్రీగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, రిచా గోష్, ఎస్.మేఘన, సైకా ఇషాకూ, సల్మా ఖాతూన్, షమీన్ అక్తర్, సుజాత మాలిక్, సోఫీయా బ్రౌన్, ఎస్బీ ప్రభాకర్,

వెలాసిటీ : దీప్తి శర్మ(కెప్టెన్), స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సఫాలీ వర్మ, అయబంగ కాకా, కేపీ నవీగిరే, కాతిరన్ క్రాస్, కీర్తి జేమ్స్, లౌరా వాల్వర్డ్, మాయా సోనవనే, నత్తకమ్ ఛాంతమ్, రాధా యాదవ్, ఆర్తి కేదర్, శివాలి షిండే, సిమ్రాన్ బహదూర్, యస్తికా బాటియా

Story first published: Monday, May 16, 2022, 16:04 [IST]
Other articles published on May 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X