న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా టీ20 ప్రపంచకప్‌ జట్టు ఇదే.. కొత్త ప్లేయర్‌కు అవకాశం!!

Women's T20 World Cup 2020 : Harmanpreet Kaur To Lead, Here Is The Full Squad ! || Oneindia Telugu
Womens ICC T20 World Cup: Harmanpreet Kaur to lead India, Richa Ghosh new face


ముంబై: ఫిబ్రవరి 21 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా మహిళా జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వం వహించనుంది. ప్రపంచకప్‌ జట్టులో రిచా ఘోష్‌ అనే కొత్త ర్‌కు అవకాశం దక్కింది. ఇటీవల మహిళల ఛాలెంజర్స్‌ ట్రోఫీలో రిచా సత్తా చాటిన విషయం తెలిసిందే. భారత స్టార్ యువ ఓపెనర్ షెఫాలీ వర్మ తొలిసారిగా ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగనుంది.

కాఫీ వివాదం.. ఆ 10 రోజులు బయటకే రాలేదు!!కాఫీ వివాదం.. ఆ 10 రోజులు బయటకే రాలేదు!!

 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌:

కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌:

స్మృతి మంధానా, షెఫాలీ వర్మ ఓపెనర్లుగా దిగనున్నారు. జెమిమా రోడ్రిగ్జ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, తానియా భాటియా, రిచా ఘోష్‌ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. పూనం యాదవ్‌, రాధా యాదవ్‌ స్పిన్ విభాగం పంచుకోగా.. రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌లు పేస్ బాధ్యతలు మోయనున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి.

గ్రూప్‌-ఎలో భారత్‌:

గ్రూప్‌-ఎలో భారత్‌:

మెగాటోర్నీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు గ్రూప్‌-ఎలో చోటు దక్కింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. వచ్చేనెల 21న ఆస్ట్రేలియాతో భారత తొలిపోరులో తలపడనుంది. ఇక గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయ్‌లాండ్ జట్లు ఉన్నాయి.

నుజహత్ పర్వీన్‌కు చోటు:

నుజహత్ పర్వీన్‌కు చోటు:

ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆసీస్‌లోనే నిర్వహిస్తున్న ముక్కోణఫు టీ20 టోర్నీకి కూడా 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచకప్‌ జట్టు సభ్యులతో పాటు నుజహత్ పర్వీన్ చోటు దక్కించుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ ముక్కోణఫు టోర్నీ అడుగుతుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు మెల్‌బోర్న్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.

టీ20 ప్రపంచకప్‌ జట్టు:

టీ20 ప్రపంచకప్‌ జట్టు:

హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.

ముక్కోణఫు సిరీస్‌ టీ20 జట్టు:

ముక్కోణఫు సిరీస్‌ టీ20 జట్టు:

హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి. పర్వీన్.

Story first published: Sunday, January 12, 2020, 16:37 [IST]
Other articles published on Jan 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X