11 ఏళ్ల క్రితం: పాక్‌ను ఓడించి ప్రపంచ కప్ గెలుచుకున్న భారత్ (వీడియో)

న్యూ ఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టీమిండియాకు ప్రపంచ కప్ అంది నేటికి పదకొండేళ్లు. 1983లో టీమిండియా కపిల్ దేవ్ నేతృత్వంలో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత భారత్‌కు మరో ప్రపంచకప్ రావడానికి 24 ఏళ్ల సమయం పట్టింది. మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో 2007 సెప్టెంబర్ 24న టీ20 తొలి ప్రపంచకప్‌ను గెలుచుకొని తన సత్తాను ప్రపంచానికి భారత్ మరోసారి చాటింది.

పదకొండేళ్ల క్రితం ప్రపంచ కప్ అందుకున్న భారత్:
ఫైనల్ పోరులో దాయాది పాకిస్థాన్‌ను ఓడించి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకుని నేటికి అంటే 24 సెప్టెంబరు 2018 నాటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ అభిమానులు ఆనాటి విజయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్ ఏమీ కాదు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేనప్పటికీ ధోనీ టీమిండియాను ముందుండి నడిపించాడు.

అనుభవం లేకున్నా.. అద్భుతంగా:
టీ20ల్లో ఆడిన అనుభవం కూడా భారత్‌కు పెద్దగా లేదు. అంతకుముందు ఏడాది క్రితం దక్షిణాఫ్రికాతో భారత్ ఒక మ్యాచ్ ఆడింది. అయితే అద్భుత ప్రదర్శనతో ధోనీ సేన ఈ టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడింది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. గౌతమ్ గంభీర్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
6 బంతులు 13 పరుగులు 1 వికెట్:
లక్ష్య ఛేదనకు దిగిన పాక్ జట్టుకు చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చేతిలో ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. జోగిందర్ సింగ్ వేసిన చివరి ఓవర్ రెండో బంతిని మిస్బా ఉల్ హక్ సిక్స్‌గా మలచడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ఆ తర్వాతి బంతిని మిస్బా షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు.
తొలి టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా:
ఊహించని రీతిలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ బంతిని ఒడిసిపట్టుకోవడంతో మ్యాచ్ విజేతగా నిలిచింది. ఇలా ఫైనల్‌లో గెలవడంతో టీమిండియాలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. తొలి టీ20 ప్రపంచకప్ టీమిండియా సొంతమైంది. ఈ ఘనత సాధించిన ధోనీ సేనకు బీసీసీఐ 2 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications