న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ నెగ్గిన విండీస్‌.. అఫ్గాన్‌కు వరుసగా 11 వన్డే ఓటమి!!

West Indies to seal 1st ODI series in 5 years after beat Afghanistan in 2nd ODI

లఖ్‌నవ్‌: బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన వెస్టిండీస్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో 47 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. దీంతో ఐదేళ్ల తర్వాత విండీస్‌ వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ మధ్య మరో సూపర్ ఓవర్.. మళ్లీ ఇంగ్లండే విజేత!!న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ మధ్య మరో సూపర్ ఓవర్.. మళ్లీ ఇంగ్లండే విజేత!!

పూరన్‌ విజృంభణ:

పూరన్‌ విజృంభణ:

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వికెట్ కీపర్ నికోలస్‌ పూరన్‌ (67; 50 బంతుల్లో 7x4, 3x6), ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ (54; 75 బంతుల్లో 6x4, 1x6) అర్ధ సెంచరీలు చేశారు. షై హోప్ (43), షిమ్రాన్ హెట్మియర్ (34) రాణించారు. అఫ్గాన్‌ బౌలర్ నవీన్‌ అల్‌ హక్‌ (3/60) మూడు వికెట్లు పడగొట్టాడు.

చెలరేగిన విండీస్‌ బౌలర్లు:

చెలరేగిన విండీస్‌ బౌలర్లు:

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్‌ 45.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. నజీబుల్లా జద్రాన్‌ (56; 66 బంతుల్లో 7x4, 1x6) అర్ధ సెంచరీతో రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ భారీ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. హజ్రతుల్లా జజాయ్ (23), రహమత్ షా (33), మహ్మద్ నబీ (32) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, వాల్ష్‌ చెరో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఐదేళ్ల తర్వాత వన్డే సిరీస్‌:

ఐదేళ్ల తర్వాత వన్డే సిరీస్‌:

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో విండీస్‌ ఒక మ్యాచ్‌ మిగిలుండగానే గెలుపొందింది. దీంతో ఐదేళ్ల తర్వాత విండీస్‌ వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. చివరిసారిగా విండీస్‌ 2014 ఆగస్టులో బంగ్లాను ఓడించి సిరీస్ నెగ్గింది. మరోవైపు అఫ్గాన్‌కు ఇది వరుసగా 11 వన్డే ఓటమి. ప్రపంచకప్ నుండి అఫ్గాన్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది.

 సెలబ్రేట్‌ చేసుకోవాలనుంది:

సెలబ్రేట్‌ చేసుకోవాలనుంది:

విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌ మాట్లాడుతూ... 'సిరీస్ విజయం చాలా సంతోషంగా ఉంది. ఆటగాళ్లతో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలనుంది. చాలా కాలం తర్వాత సిరీస్ విజయం కాబట్టి గెలుపును ఆస్వాదించాల్సిన అవసరముంది. ఓపెనర్లు మంచి పునాది వేశారు. పూరన్ బాగా బ్యాటింగ్ చేసాడు. హెట్మియర్ పరిస్థితికి అనుగుణంగా ఆడాడు. బౌలర్లు తమ పని పూర్తిచేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ గెలవడానికి ప్రయత్నిస్తాం' అని అన్నాడు.

Story first published: Sunday, November 10, 2019, 13:34 [IST]
Other articles published on Nov 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X