న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొరపాట్లు చేయలేదు, టై అనేది చెడు ఫలితం ఏమీ కాదుగా: ధోని

We could have lost, tie not a bad result: MS Dhoni

హైదరాబాద్: అంపైర్ల నిర్ణయాలు గురించి మాట్లాడి తాను జరిమానా ఎదుర్కొవాలని అనుకోవడం లేదని ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహారించిన ధోని అన్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే.

తప్పులున్నాయి.. అంపైర్లకు జరిమానా విధించకండి: ధోనీతప్పులున్నాయి.. అంపైర్లకు జరిమానా విధించకండి: ధోనీ

భారత విజయానికి రెండు బంతుల్లో ఒక పరుగు అవసరమైన సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ "ఛేజింగ్‌లో మేం ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఓపెనర్ల నుంచి మంచి ఆరంభం లభించినప్పటికీ మ్యాచ్‌ జరిగేకొద్ది పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా మారింది" అని అన్నాడు.

 కొన్ని అంశాలు మాకు ప్రతికూలంగా మారాయి

కొన్ని అంశాలు మాకు ప్రతికూలంగా మారాయి

"దీంతో ఎవరో ఒకరు బాగా బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దశలో కొన్ని అంశాలు మాకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు మేం పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. సరిపడా స్పిన్నర్లు లేరు. సీమర్లు స్వింగ్‌ చేయలేకపోయారు. రనౌట్లు, మరికొన్ని అంశాలు(తప్పుడు ఎల్బీ నిర్ణయాలు) కారణంగానే మ్యాచ్‌ను ఫలితం తేలకుండా ముగించాల్సి వచ్చింది" అని ధోని చెప్పుకొచ్చాడు.

జరిమానా ఎదుర్కొవాలని అనుకోవడం లేదు

జరిమానా ఎదుర్కొవాలని అనుకోవడం లేదు

"వాటి(అంపైర్ల నిర్ణయాలు) గురించి మాట్లాడి జరిమానా ఎదుర్కొవాలని అనుకోవడం లేదు. మరోవైపు ఆప్ఘనిస్తాన్ ప్లేయర్లు సైతం చాలా బాగా ఆడారు. ఈ పిచ్‌లో 50 పరుగులు చాలా మంచి స్కోరు. ఈ మ్యాచ్‌ను బాగా ఆస్వాదించాం. ఆప్ఘనిస్థాన్ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మెరుగ్గా ఉంది" అని ధోని చెప్పాడు.

 50 ఓవర్లలో 252 పరుగులు చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు

50 ఓవర్లలో 252 పరుగులు చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు

తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులు చేసింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రాహుల్‌, రాయుడు దూకుడుగా ఆడటంతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రాహుల్‌... రషీద్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.

 రివ్యూలో నాటౌట్‌గా తేలిన ధోని, దినేశ్ కార్తీక్

రివ్యూలో నాటౌట్‌గా తేలిన ధోని, దినేశ్ కార్తీక్

రాహుల్ దీనిని నాటౌట్‌గా భావించి రివ్యూ కోరాడు. కానీ రివ్యూలో ఫలితం రాహుల్‌కి ప్రతికూలంగా రావడంతో భారత్ రివ్యూలు కోరే అవకాశాన్ని కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ ధోని, దినేశ్ కార్తీక్‌లు ఇద్దరూ ఎల్బీలుగా అవి నాటౌట్ అయినప్పటికీ.. అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే, టీమిండియా అప్పటికే రివ్యూలు కోరే అవకాశం లేకపోవడంతో వారిద్దరు ఏమీ చేయలేక పెవిలియన్‌కు చేరారు.

Story first published: Wednesday, September 26, 2018, 19:53 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X