న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొలార్డ్‌ను 'వండర్ బాల్'‌తో పెవిలియన్‌కు చేర్చిన అఫ్రిది (వీడియో)

By Nageshwara Rao
Watch: Shahid Afridi's 'Wonder' Ball Leaves Kieron Pollard Stunned

హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు, ఆల్‌ రౌండర్‌ షాహిద్ అఫ్రీది బంతితో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆదివారం ముల్తాన్‌ సుల్తాన్స్‌, కరాచీ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాజీ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఆ తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముల్తాన్‌ జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అఫ్రిది తన బౌలింగ్‌తో మాయచేశాడు.

పోలార్డ్‌, షోయబ్‌ మాలిక్‌, సైఫ్‌ బాబర్‌ వంటి కీలక బ్యాట్స్‌‌మెన్లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ముఖ్యంగా వెస్టిండిస్ ఆటగాడు పోలార్డ్‌.. అఫ్రీది వేసిన బంతి స్వింగ్‌ అయి వికెట్లను తాకటంతో ఆశ్చర్యపోయాడు. ఈ మ్యాచ్‌లో అఫ్రిది 4 ఓవర్లలో(ఒక మెయిడెన్‌)తో పాటు 18 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో సైఫ్‌ బాదర్‌‌ను అవుట్‌ చేశాక అఫ్రిది కాస్త దూకుడుని ప్రదర్శించాడు. అతడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అభిమానులు సోషల్‌ మీడియాలో అఫ్రిదిపై తీవ్ర విమర్శలు చేశారు. మ్యాచ్ అనంతరం బాదర్‌ ఈ వీడియోపై "ఇప్పటికీ నువ్వంటే ఇష్టం షాహిద్‌ భాయ్‌" అంటూ పోస్టు చేశాడు.

బాదర్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు అఫ్రీది ప్రకటించటంతో ఈ వివాదానికి తెర పడింది. ఇదిలా ఉంటే గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది అఫ్రిది బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తుండటం విశేషం.

Story first published: Monday, March 12, 2018, 10:57 [IST]
Other articles published on Mar 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X