న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

33 ఏళ్లు.. 33 సెంచరీలు.. 33 బీర్లు

Watch: Beer Man Alastair Cook All Smiles After British Medias Grand Gesture

లండన్‌: భారత్‌తో చివరి టెస్టు అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ అలిస్టర్‌ కుక్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ఊహించని కానుక అందింది. అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో కుక్‌ 33 శతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలో కుక్‌కు మీడియా సమావేశంలో ప్రతినిధులంతా కలిసి 33 బీర్‌ బాటిళ్లు అందజేశారు. అంతేకాదు ఒక్కో బాటిల్‌పై ఒక్కో మెసేజ్‌ను రాసి కుక్‌కు అందించారు. అనంతరం కుక్‌ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

1
42378
అలిస్టర్ కుక్‌కు బ్రిటిష్ మీడియా సర్‌ప్రైజ్ గిఫ్ట్:

అలిస్టర్ కుక్‌కు బ్రిటిష్ మీడియా సర్‌ప్రైజ్ గిఫ్ట్:

33 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న ఇంగ్లండ్ టీమ్ ఓపెనర్ అలిస్టర్ కుక్‌కు బ్రిటిష్ మీడియా ఇలా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. చివరి టెస్ట్‌లో చివరి సెంచరీగా 33వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో దానికి గుర్తుగా అతని ఫేర్‌వెల్ ప్రెస్‌మీట్‌లోనే కుక్‌కు 33 బీర్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చారు అక్కడి జర్నలిస్టులు. తన చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కుక్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఓ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఇంగ్లండ్ క్రికెట్‌కు:

ఓ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఇంగ్లండ్ క్రికెట్‌కు:

ఈ సందర్భంగా కుక్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి కుక్‌ వద్దకు ఒక పెట్టె పట్టుకుని వెళ్లాడు. కుక్ 12 ఏళ్ల కెరీర్‌ను దగ్గర నుంచి చూసిన స్పోర్ట్స్ జర్నలిస్టులంతా ఈ గిఫ్ట్ ఇచ్చారు. మా మీడియా తరఫున ఇదో బహుమతి. ఇన్నేళ్లలో మీరు ఓ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఇంగ్లండ్ క్రికెట్‌కు అందించిన సేవలకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం.. ముఖ్యంగా మీరు మాతో వ్యవహరించిన తీరు అద్భుతం అని ఓ జర్నలిస్ట్ కుక్‌తో అన్నాడు.

వైన్‌ డ్రింకర్‌ను కాదు బీర్‌ మ్యాన్‌ని

వైన్‌ డ్రింకర్‌ను కాదు బీర్‌ మ్యాన్‌ని

గతంలో మీరు ఓసారి మాట్లాడుతూ ‘నేను వైన్‌ డ్రింకర్‌ను కాదు బీర్‌ మ్యాన్‌' అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకునే మీకు 33 బీర్‌ బాటిళ్లను కానుకగా అందజేస్తున్నాం. ఒక్కో బాటిల్‌పై ఒక్కో మీడియాకు చెందిన ప్రతినిధి మీ కోసం ప్రత్యేకమైన మెసేజ్‌ రాశారు' అని అతను తెలిపాడు. ఆ వ్యక్తి చెప్పేదాన్ని నవ్వుతూ విన్న కుక్‌ అనంతరం మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత అందరితో కరచాలనం చేశాడు. ఫొటోలు కూడా దిగాడు.

చివరి టెస్టులోనూ సెంచరీ సాధించిన ఆటగాళ్లలో

చివరి టెస్టులోనూ సెంచరీ సాధించిన ఆటగాళ్లలో

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య లండన్‌ వేదికగా ఐదో టెస్టు జరుగుతోంది. సోమవారం నాలుగో రోజు ఆటతో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ కుక్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కుక్‌ ఆడుతోన్న చివరి టెస్టు ఇదే. అరంగేట్ర టెస్టుతో పాటు చివరి టెస్టులోనూ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుక్‌ స్థానం దక్కించుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం కుక్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

Story first published: Tuesday, September 11, 2018, 14:55 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X