న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంచ్ కే బాద్ ఆనా: సెహ్వాగ్ బ్యాంకుల ట్వీట్‌పై స్పందించిన బ్యాంకర్లు

By Nageshwara Rao
 Virender Sehwag Mocked PSU Banks In Cricket Tweet, 2 Bankers Shot Back

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ట్విట్టర్‌లో పంచ్‌లేస్తూ ఎంతో మంది అభిమానులను తన ఫాలోవర్స్‌గా మలచుకున్నాడు. ఏ విషయంలో అయినా తనదైన స్టైల్‌లో పంచ్‌లేయడంలో సెహ్వాగ్ దిట్ట.

2 పరుగులు చేస్తే విజయం: అంఫైర్ల లంచ్ బ్రేక్‌పై నెటిజన్ల జోకులు2 పరుగులు చేస్తే విజయం: అంఫైర్ల లంచ్ బ్రేక్‌పై నెటిజన్ల జోకులు

తాజాగా, సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో అంపైర్ల లంచ్ బ్రేక్ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలిన సంగతి తెలిసిందే. దీనిపై సెహ్వాగ్ కూడా స్పందించాడు. 'పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కస్టమర్లను ఎలా ట్రీట్ చేస్తారో.. ఇండియన్ ప్లేయర్స్‌ను అంపైర్లూ అలాగే చూశారని, లంచ్ కే బాద్ ఆనా' అంటూ పంపించేశారని ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్ ట్వీట్‌పై కొందరు బ్యాంకర్లు స్పందించారు. 'వీరూ సార్.. మేము కూడా బ్యాంకర్లమే.. కానీ ఎప్పుడూ కస్టమర్లతో అలా వ్యవహరించలేదు' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లకు సెహ్వాగ్ రిప్లై ఇచ్చాడు. 'మీరు మినహాయింపులేగానీ.. చాలా వరకు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సగటు జీవికి రోజూ ఎదురయ్యే అనుభవాలే కదా ఇవి' అంటూ మరో సెటైర్ వేశాడు.


అసలేం జరిగిందంటే:
కాగా, సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 117/1గా ఉంది. మరో 2 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు.

ఈ క్రమంలో ధావన్‌ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా అంపైర్లు ఒక్కసారిగా 'లంచ్‌' అని ప్రకటించేశారు. దాంతో ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లీ, మార్క్రమ్‌ ఆశ్చర్యానికి లోనయ్యారు. వారిద్దరు అంపైర్లతో ఏదో చెప్పబోయిన సమయంలో రూల్స్‌ అంటే రూల్స్‌ అంటూ వారు తిరస్కరించారు.

దీంతో చేసేదేమీ లేక ఆటగాళ్లు మైదానం వీడారు. అంఫైర్ల నిర్ణయంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రిఫరీ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోకుండా రాతియుగం లాంటి నిబంధనలు అమలు చేయడం ఏమిటని మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

15 ఓవర్లు ముగిశాక మరో 26 పరుగులు చేయాల్సిన సమయంలోనే లంచ్‌ సమయం అయింది. నిజానికి ఈ సమయంలోనే బ్రేక్‌ ఇస్తే ఇంతగా విమర్శలు వచ్చేవి కావు. అయితే అంపైర్లు ఫలితాన్ని ఆశిస్తూ మరో 15 నిమిషాలు పొడిగించారు. ఆపై 4 ఓవర్లలో భారత్‌ 24 పరుగులు చేసింది.

ఈ క్రమంలో అంఫైర్లు ఆటను నిలిపివేశారు. 45 నిమిషాల విరామం తర్వాత వచ్చీ రాగానే భారత్‌ గెలవలేదు. షమ్సీ వేసిన 20వ ఓవర్‌లో ధావన్‌ పరుగులేమీ చేయకపోవడంతో అది 'మెయిడిన్‌' ఓవర్ అయింది. ఆ తర్వాత తాహిర్‌ ఓవర్‌ మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులు తీసి లాంఛనం పూర్తి చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 16:34 [IST]
Other articles published on Feb 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X