మనకంటే మహిళలే ఎక్కువ: కోహ్లీ

Posted By:
Virat Kohli Says 'Women Better than Equal' on International Women's Day

హైదరాబాద్: విరామ సమయంలో ఎప్పుడూ పార్టీ మూడ్ లో కనిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మహిళా దినోత్సవం గురించి మాట్లాడాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం సరదాగా గడుపుతోన్న విరాట్ ట్విట్టర్ ద్వారా ఉమెన్స్ డే శుభాకాంక్షలంటూ మహిళల గురించి మాట్లాడాడు. తన భార్య అనుష్క శర్మకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు.

వీడియోలో విరాట్:
'పురుషులు, మహిళలు సమానం కాదు. నిజాయతీగా చెప్పాలంటే.. ఒకరిని మరొకరితో పొల్చడం చాలా సులభం. లైంగిక వేధింపులు, వివక్ష, సెక్సిజమ్, గృహా హింస, బెదిరింపులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలనే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మహిళల ఎదుగుదల, అభ్యున్నతి కొనసాగుతుంది' అని పేర్కొన్నాడు.

పురుషుల కంటే మహిళలే ఎక్కువ:
ఇప్పటికి మహిళలు పురుషులతో సమానమేనా? లేదు. సమానత్వం కన్నా వాళ్లు ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని కోహ్లీ వివరించాడు. మీ జీవితంలో అసాధారణ ప్రతిభగల మహిళలను ట్యాగ్ చేయండని ట్విటర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చాడు.

ఇలా చాలా సార్లు గెలిచాడు కోహ్లీ:
మహిళల విషయంలో మహిళా సాధికారత, సమానత్వం, మహిళా అభ్యున్నతికి సంబంధించిన కార్యక్రమాల్లో విరాట్ చురుగ్గా పాల్గొనడంతో పాటు వారికి మద్దతుగా నిలుస్తున్నాడు. ఉమెన్స్ డే సందర్భంగా ముఖ్యంగా తన జీవిత భాగస్వామికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు.

Story first published: Thursday, March 8, 2018, 12:48 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి