న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ పర్యటనతో తేలనున్న విరాట్ కోహ్లీ భవితవ్యం.. తప్పించే యోచనలో బీసీసీఐ!

Virat Kohlis T20I future depend on how he performs in the two T20I and ODIs against England

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లే చివరి అవకాశామా? అతన్ని పక్కన పెట్టే యోచనలో సెలెక్టర్లు ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని 9 నెలలు అవుతున్నా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. పేలవ బ్యాటింగ్‌తో సతమతమవుతున్న అతను జట్టుకు భారంగా మారాడు.

మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమ్‌మేనేజ్‌మెంట్ టీమ్ కాంబినేషన్‌పై దృష్టిసారించింది. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దొరకడం కష్టంగా మారింది. ఇంగ్లండ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించడంపై కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉందని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఇండియాకు తెలిపాడు.

కోహ్లీకి అగ్ని పరీక్ష..

కోహ్లీకి అగ్ని పరీక్ష..

ఇంగ్లండ్ పర్యటన అనంతరం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే వన్డే జట్టును భారత సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. ఈ మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చింది. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ పర్యటనలో మూడు వన్డేల సిరీస్ అనంతరం టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కోసం జట్టును ఈ నెలాఖరులో ప్రకటించనుంది.

పేలవ ఫామ్ నేపథ్యంలో..

పేలవ ఫామ్ నేపథ్యంలో..

అయితే ఈ టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లను ఎంపిక చేయనుంది. బుమ్రాకు పూర్తిగా ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వనుండగా.. విరాట్ కోహ్లీ ఎంపిక మాత్రం ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించడంపై ఆధారపడి ఉంది. ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి టీ20 ఫార్మాట్ మిడిలార్డర్‌‌లో సెట్ అవుతాడనే విషయంపై సెలెక్షన్ కమిటీ క్లారిటీగా లేదని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.

రాణిస్తే జట్టులోకి..

రాణిస్తే జట్టులోకి..

'టీ20 సిరీస్ కోసమే సీనియర్ ఆటగాళ్లందరికీ వెస్టిండీస్ పర్యటనలోని వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రోహిత్, పంత్, హార్దిక్ టీ20 సిరీస్‌తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. బుమ్రాకు మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు. కోహ్లీని మాత్రం ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో కనబర్చే ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు.'అని సదరు అధికారి స్పష్టం చేశాడు. గత మూడేళ్లుగా విరాట్.. మూడు ఫార్మాట్లలో విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాతనైనా అతను రాణిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

యువ ఆటగాళ్లతో తీవ్ర పోటీ..

యువ ఆటగాళ్లతో తీవ్ర పోటీ..

ఐపీఎల్‌లోనూ తడబడ్డాడు. ఈ క్రమంలోనే మిడిలార్డర్‌లో సత్తా కలిగిన యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్, జడేజా, దీపక్ హుడా, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్‌లు ఉండగా కోహ్లీని ఆడించడం అవసరమా? అనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. ప్రతీ మీటింగ్‌లో ఆటగాళ్ల వర్క్‌లోడ్‌పై చర్చిస్తున్న టీమ్‌మేనేజ్‌‌మెంట్ ప్రతీ సిరీస్ తర్వాత సెకండ్ సిరీస్ విశ్రాంతినిచ్చి..ఆటగాళ్లను రొటేషన్ చేయాలని నిర్ణయించిందని ఓ అధికారి తెలిపాడు. మొత్తానికి ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించడంపైనే కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.

Story first published: Thursday, July 7, 2022, 13:35 [IST]
Other articles published on Jul 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X