దళపతి విజయ్ ప్రభంజనం.. నిజమైన జోఫ్రా ఆర్చర్ జోస్యం!
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా కొనసాగుతోంది. ప్రధాన కూటములైన అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేల ఆధిపత్యానికి తెరదించి అధికారం చేపట్టేందుకు తలపతి విజయ్ సిద్దమవుతున్నారు.
234 స్థానాలు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 118 స్థానాలు అవసరం కాగా.. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా ఇతరుల సాయంతో టీవీకే అధికారం చేపట్టే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో తమిళ ప్రజలు విజయ్‌కి పట్టం కట్టి స్పష్టమైన మార్పు కోరుకున్నారు. రెండేళ్ల క్రితం పుట్టిన కొత్త పార్టీకి ఈ స్ధాయిలో సీట్లు ఇవ్వడం ద్వారా తమిళ ఓటర్లు, ముఖ్యంగా యువత తమ అభిప్రాయాన్ని క్లియర్ గా చెప్పేశారు. ఈ విజయం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా విజయ్ పేరు మారుమోగుతోంది.
11 ఏళ్ల క్రితమే జోఫ్రా ఆర్చర్ జోస్యం..
రాజస్థాన్ రాయల్స్ పేసర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోఫ్రా ఆర్చర్ తన 'భవిష్యవాణి' ట్వీట్‌లతో నెట్టింట ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన చేసిన ఎన్నో పోస్ట్‌లు ప్రస్తుత సంఘటనలతో సరిపోలి వైరల్‌గా మారాయి. విజయ్ విజయాన్ని కూడా జోఫ్రా ఆర్చర్ 11 ఏళ్ల కిత్రమే ఊహించాడు. 2015లో అతను చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
విజయ్ WTF అని జోఫ్రా ఆర్చర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ ఆర్చర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే తలపతి విజయ్ గురించి కాకుండా క్రికెటర్ మురళీ విజయ్ గురించి ఆర్చర్ ట్వీట్ చేసి ఉంటాడని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా తమిళ రాజకీయాల్లో విజయ్ విజయం సంచలనంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ టీవీకే అధికారం చేపట్టేందుకు సిద్దమవుతోంది.

రాత్రికి రాత్రే దక్కలేదు..
విజయ్‌కి ఈ విజయం ఒక్క రాత్రిలోనే వచ్చింది కాదు. ఈ గెలుపు వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పక్కా ప్లాన్‌తో విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి ఫస్ట్ ఎలక్షన్‌లోనే సెంచరీ కొట్టాడని అభిప్రాయపడుతున్నారు. ముందుగా అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువైన విజయ్.. సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో వారి మనసులను గెలుచుకున్నాడు.
ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల నుంచి విద్యా కార్యక్రమాలకు మద్దతు వరకు, ఆయన అభిమాన నెట్‌వర్క్‌లు క్రమంగా ఒక పటిష్టమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకున్నాయి. పాలన, అవినీతి, సామాజిక న్యాయం వంటి అంశాలను విజయ్ తరుచూ తన సినిమాల్లో ఉండేలా చూసుకున్నారు. 2024లో ఆయన టీవీకే పార్టీని డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రారంభించారు. పారదర్శక పాలన, ఉద్యోగావకాశాలు, సంక్షేమ విధానాలను లక్ష్యంగా చేసుకుని, యువతను టీవీకే ఆకర్షించింది. తన డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి యువతను తనవైపు తిప్పుకున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. పర్పుల్ క్యాప్ కోసం పోటీపడుతున్న అతను ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ మెరుగైన బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications