అనుష్క కోసమేనా?: విరాట్ కొత్త కారు ఖరీదు దాదాపు రూ. 4కోట్లు

Posted By:
Virat Kohli’s new love: India captain adds dream supercar to his collection

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మరో కారుకు ఓనరయ్యాడు. ప్రముఖ కార్ల కంపెనీ ఆడీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ.. ఇటీవలే జర్మనీకి సంబంధించిన ఓ ఆడీ కారు కొనుగోలు చేశాడు. దీంతో కోహ్లీ దగ్గర ఆడి ఆర్8 ఎల్‌ఎంఎక్స్ లిమిటెడ్ ఎడిషన్, ఆడి ఆర్8 వీ10, ఆడి ఏ8ఎల్ డబ్ల్యూ12 క్వాట్రో, ఆడి ఎస్6, ఆడి క్యూ7లతోపాటు టొయొటా ఫార్చునర్, రెనాల్ట్ డస్టర్ కార్లు కోహ్లి దగ్గర ఉన్నాయి.

ఇప్పుడు కోహ్లీ తాజాగా బెంట్లీ కాంటినెంటల్‌ జీటీని కొన్నాడట. తన సోదరుడు వికాస్‌ కోహ్లీ పేరు మీద ఈ కారు తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 1న భార్య అనుష్క శర్మ పుట్టిన రోజు. ఆమెకు కానుకగా ఇచ్చేందుకే కోహ్లీ ఈ కారు కొన్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌ కూడా బెంట్లీ కారు ఓనర్లే.

బెంట్లీ కాంటినెంటల్ జీటీ ఈ మధ్యే ఇండియాలో లాంచ్ అయింది. ఈ కార్లను ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు సెహ్వాగ్, యువరాజ్ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌ 7న ఐపీఎల్‌ ప్రారంభంకానుంది. ప్రారంభ వేడుకలకు కొన్ని కారణాల వల్ల ఆరు జట్లకు చెందిన కెప్టెన్లు పాల్గొనడం లేదు. టోర్నీలో భాగంగా ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 8వ తేదీన జరగనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 16:25 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి