చాహల్‌కు వాచ్ ఇస్తా, ఫెదరర్ అంటే గౌరవం: కోహ్లీ

Posted By:
Virat Kohli recognises the need to manage his workload

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విరామంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న కోహ్లీ మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైయ్యాడు. అక్కడ మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించాడు. ఇదే సరైన సమయం, ఫిట్‌నెస్‌పై ధ్యాస పెట్టాల్సిందేనని తెలిపాడు. ఫిట్‌గా ఉంటేనే ఏ పనైనా ఫోకస్‌తో చేయగలమని కోహ్లీ పేర్కొన్నాడు. శరీరం సహకరించకపోతే ఆడేందుకు వీలుకాదని పేర్కొన్నాడు. ఈ విరామ సమయంతో ఫ్రెష్ మైండ్‌తో ఉన్నానని, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నానని వివరించాడు.

 రోజర్‌ అంటే చాలా గౌరవం:

రోజర్‌ అంటే చాలా గౌరవం:

'స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ నా ఫేవరెట్‌ ప్లేయర్‌. ఫెడరర్‌ అద్భుతంగా, అందంగా ఆడతాడు. తనకు ఒక మంచి కుటుంబం ఉంది. ప్రాధాన్యతలేమిటో బాగా తెలుసు. జనాల వ్యాఖ్యలు, విమర్శల గురించి పట్టించుకోకుండా తనకంటూ సమయాన్ని కేటాయిస్తాడు. 36 ఏళ్ల వయసులో అలవోకగా గ్రాండ్‌స్లామ్‌లు గెలిచేస్తున్నాడు. అసాధ్యం అనే మాటనే అతడు సవాల్‌ చేస్తున్నాడు. నిజంగా రోజర్‌ అంటే చాలా గౌరవం. ఇటీవలే స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఆటోబయోగ్రఫీ కూడా చదివాను.

తనంత బద్ధకస్తుడు మరొకరు:

తనంత బద్ధకస్తుడు మరొకరు:

మైదానంలో విరాట్‌ కోహ్లి చురుకుదనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు కొత్త అర్థం చెప్పిన ఆటగాడతను. అయితే ఆటకు దూరంగా ఉన్న సమయంలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటానని అతడు చెబుతున్నాడు. ఏదైనా పని లేకపోతే తనంత బద్ధకస్తుడు మరొకరు ఉండరని కోహ్లి వెల్లడించడం విశేషం.

 క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం లేదు:

క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం లేదు:

చేయాల్సిన పనేమీ లేనప్పుడు ఒకే చోట నేను గంటల కొద్దీ కూర్చుండిపోతాను. మైదానంలో ఎంత చురుగ్గా ఉన్నా, ఇంట్లో మొద్దులా ఉండిపోతా. నా ఈ ప్రవర్తన ఇతరులకు చిరాకు తెప్పించేలా ఉంటుంది. నేను ఎంత బద్ధకస్తుడినో దీన్ని బట్టి చెప్పవచ్చు. ప్రస్తుతం లభించిన విరామాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం లేదు. ఫలితాల గురించి మాత్రం తెలుసుకుంటున్నాను.

 అతను ప్రతీసారి ఆలస్యంగా:

అతను ప్రతీసారి ఆలస్యంగా:

నా బయోపిక్‌ తీస్తే అది ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. నా జీవితం సరిగ్గా ఎలా సాగిందో అది అలాగే ఉండాలి. నిజంగా తీస్తే గనక ఒక కొత్త నటుడు ఎవరైనా నా పాత్రను సమర్థంగా పోషించాల్సి ఉంటుంది. చేతి గడియారాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటే చాహల్‌కు ఇస్తాను. ఎందుకంటే అతను ప్రతీసారి ఆలస్యంగా వస్తాడు.

ఎప్పుడు తినమన్నా

ఎప్పుడు తినమన్నా

‘జపనీస్‌ వంటకాలంటే నాకు చాలా ఇష్టం. రోజులో ఎప్పుడు తినమన్నా తినేస్తా. అంతకుముందు మొగలాయ్‌, బటర్‌ చికెన్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వీటికి చాలా దూరంగా ఉంటున్నా' అని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు విరాట్‌ కోహ్లీ.

Story first published: Wednesday, March 14, 2018, 10:43 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి