న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్, అయ్యర్ ఒకేసారి పిచ్‌పైకి: అసలు విషయం వెల్లడించిన విరాట్ కోహ్లీ

Virat Kohli on Rishabh Pant and Shreyas Iyer both coming out to bat at No.4

హైదరాబాద్: రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌ల మధ్య 'సమాచారలోపం' వల్లే NO.4 స్థానంలో ఇద్దరూ ఒకే సమయంలో బ్యాటింగ్‌కు చేసేందుకు బయటకు వచ్చారని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఛేజింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై విరాట్‌ కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ తీసుకోవడాన్ని క్రీడా విశ్లేషకులు విమర్శిస్తున్నారు. దీనిపై మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తమ నిర్ణయం సరైంది కాదని పరోక్షంగా ఒప్పుకున్నాడు.

India vs South Africa: 'No.4 స్పాట్‌లో పంత్ సక్సెస్ అవలేడు'India vs South Africa: 'No.4 స్పాట్‌లో పంత్ సక్సెస్ అవలేడు'

అంతేకాదు ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటైన తర్వాత రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు బ్యాటింగ్ చేసేందుకు ఒకే సమయంలో మైదానంలోకి వెళ్లేందుకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. దీనిపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "సమాచారలోపం వల్లే అలా జరిగింది. ఆ తర్వాతే నాకు ఆ విషయం తెలిసింది' అని మీడియా సమావేశంలో చెప్పాడు.

బ్యాటింగ్ కోచ్ వారిద్దరితో మాట్లాడారు

బ్యాటింగ్ కోచ్ వారిద్దరితో మాట్లాడారు

"బ్యాటింగ్ కోచ్ వారిద్దరితో ఒక మాట మాట్లాడారు. దీంతో ఎవరు ఏ స్థానంలో వెళ్లాలనే దానిపై సమాచారలోపం ఉంది. నిజానికి ఇది కొంచెం ఫన్నీగా ఉంది. ఎందుకంటే వారిద్దరూ మైదానంలోకి రావాలని అనుకున్నారు. ఇద్దరూ పిచ్‌కు చేరుకుంటే చాలా ఫన్నీగా ఉండేది. అప్పుడు మైదానంలో మైదానంలో ముగ్గురు బ్యాట్స్ మెన్ ఉండేవారు" అని కోహ్లీ అన్నాడు.

NO.4 స్థానంలో ఎవరిని ఆడించాలని

NO.4 స్థానంలో ఎవరిని ఆడించాలని

NO.4 స్థానంలో ఎవరిని ఆడించాలని అనుకున్నారు? అన్న ప్రశ్నకు గాను కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. "10 ఓవర్లు ముగిసిన తర్వాత రిషబ్ పంత్‌ను ఆ స్థానంలో పంపాలని అనుకున్నాం. అంతకముందుగా అయితే శ్రేయాస్ అయ్యర్‌ను పంపాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతో వారిద్దరూ ఏ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు రావాలనే అంశంపై చిన్నపాటి గందరగోళానికి గురయ్యారని నేను భావిస్తున్నా" అని చెప్పాడు.

ఓటమిపై కోహ్లీ ఇలా

ఓటమిపై కోహ్లీ ఇలా

ఈ మ్యాచ్‌లో ఓటమిపై కోహ్లీ మాట్లాడుతూ "గేమ్‌ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేయడం మాకు అనుకూలించలేదు. కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు మాకు అదే జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో మాకు ప్రతికూల ఫలితం వచ్చిందనే విషయాన్ని కూడా కాదనలేం" అని చెప్పుకొచ్చాడు.

పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాం

పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాం

"రాబోయే మ్యాచ్‌ల్లో దీనిని పునరావృతం చేయం. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యామనే అనుకుంటున్నా. ఇందులో మేము ఇంకా మెరుగవ్వాలి" అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక, మూడో టీ20లో సమిష్టి ప్రదర్శన చేసిన సఫారీ జట్టుపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ జట్టులో ప‍్రతీ ఒక్కరూ మంచి ప్రదర్శన చేయడం వల్లే ఈ మ్యాచ్‌లో ఓడామని అన్నాడు.

Story first published: Monday, September 23, 2019, 13:34 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X