న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2 వన్డేల నిషేధం విధించండి: నోరు జారిన పాండ్యా, రాహుల్‌పై సీఓఏ

Vinod Rai recommends 2-ODI ban for Hardik Pandya, KL Rahul; Diana Edulji seeks legal view

హైదరాబాద్: బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షో‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లపై బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ కఠిన చర్యలకు సిఫారసు చేశారు. ఈ ఇద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని ఆయన ప్రతిపాదించారు.

అయితే కమిటీలో మరో సభ్యురాలైన డయానా ఎడుల్జీ మాత్రం ఈ అంశాన్ని బీసీసీఐ లీగల్ సెల్‌కు పంపించారు. 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షో‌లో హార్ధిక్ పాండ్యా చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇద్దరికీ బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ నజరానాఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ నజరానా

దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. పాండ్యా క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అతని వివరణకు తనకు సంతృప్తినివ్వలేదని, అందుకే రెండు వన్డేల నిషేధానికి సిఫారసు చేసినట్లు వినోద్ రాయ్ వెల్లడించారు. డయానా కూడా దీనికి ఓకే చెబితే.. ఆ ఇద్దరు ఆటగాళ్లను నిషేధిస్తామని ఆయన అన్నారు.

"ఆ ఇద్దరినీ రెండు వన్డేలకు నిషేధించవచ్చో లేదో తెలుసుకోవడానికి డయానా ఈ అంశాన్ని లీగల్ సెల్‌కు రిఫర్ చేశారు. ఆమె అంగీకారం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. నా వరకు పాండ్యా చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి" అని వినోద్ రాయ్ వివరించారు.

కాగా, పాండ్యా ఇప్పటికే ట్విటర్ ద్వారా క్షమాపణ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం స్పందించలేదు. అయితే, నెటిజన్ల ఆగ్రహాం చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో సీఓఏ ఈ ఇద్దరిపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంది.

రెండు వన్డేల నిషేధం విధించండి

రెండు వన్డేల నిషేధం విధించండి

ఇందులో భాగంగా హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం విధించాలని బీసీసీఐ పాలకుల కమిటీ సూచించింది. హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పడంపై బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జి స్పందించారు. వారు మాట్లాడిన మాటలకి కేవలం క్షమాపణ సరిపోదని.. వారిని క్రికెట్ నుంచి నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్‌. మూడోది రిలేషన్‌షిప్‌" అని సమాధానమిచ్చాడు.

తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి

తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి

మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్‌లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు.

Story first published: Thursday, January 10, 2019, 14:30 [IST]
Other articles published on Jan 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X