న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీతో భారత్‌ను పటిష్ట స్థితిలో: పుజారాపై ప్రశంసల వర్షం

Twitter reacts as Pujara helps India dominate Day 2 of the Boxing Day Test

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారత్ మెరుగైన స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఆటలో భాగంగా రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ స్కోరు 215/2తో తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన టీమిండియా పుజారా (106), విరాట్ కోహ్లీ (82), రోహిత్ శర్మ (63 నాటౌట్) అద్భుత ప్రదర్శన చేశారు.

బాక్సింగ్ డే టెస్టులో పుజారా సెంచరీ: భారత్ 443/7 డిక్లేర్డ్, ఆసీస్ 8/0బాక్సింగ్ డే టెస్టులో పుజారా సెంచరీ: భారత్ 443/7 డిక్లేర్డ్, ఆసీస్ 8/0

దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 443 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్ మూడు వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు, హాజెల్‌వుడ్‌, లియాన్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి కెట్లేమీ కోల్పోకుండా 8 ప‌రుగులు చేసింది. క్రీజులో హారిస్ (3), ఫించ్ (2) పరుగులతో ఉన్నారు.

1
43625
ఆసీస్ బౌలర్లను సమర్ధంగా

ఆసీస్ బౌలర్లను సమర్ధంగా

ఈ మ్యాచ్‌లో ఛటేశ్వర్ పుజారా ఆసీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని సెంచరీ సాధించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 280 బంతులను ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్ల సాయంతో తన కెరీర్‌లో 17వ సెంచరీ సాధించాడు. ఆసీస్‌పై పుజారాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

 విహారి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా

విహారి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా

ఓపెనర్ హనుమ విహారీ విఫలమైన తర్వాత క్రీజులోకి వచ్చిన పూజారా వికెట్‌ను కాపాడుకునేందుకు చాలానే కష్టపడ్డాడు. మయాంక్ పరుగుల వేగానికి సహకారాన్ని అందించాడు. ఆ తర్వాత మయాంక్ అవుట్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో పాటు నిదానంగా పరుగులు జోడించాడు.

సెంచరీతో సరికొత్త రికార్డులు

సెంచరీతో సరికొత్త రికార్డులు

నిదానంగా ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్యాట్స్‌మన్ పూజారా సెంచరీతో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 68తో బ్యాటింగ్‌ని కొనసాగించిన పుజారా 280 బంతులు ఆడి 10 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

 ఫోర్‌తో సెంచరీ సాధించిన పుజారా

ఫోర్‌తో సెంచరీ సాధించిన పుజారా

ఇన్నింగ్స్ 114వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ.. మిడాఫ్ దిశగా బౌండరీ బాదిన పుజారా.. కెరీర్‌లో 17వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకోగలిగాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా పుజారా సరికొత్త రికార్డుల్లో నిలిచి దిగ్గజాల సరసన చేరాడు. ఇప్పటి వరకు మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), విరాట్ కోహ్లి (2014), అజింక్య రహానె (2014) మాత్రమే సెంచరీలు సాధించారు.

Story first published: Thursday, December 27, 2018, 14:18 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X