న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Womens T20 Challenge: ఉత్కంఠలో గెలిచిన ట్రైల్‌బ్లేజర్స్.. అయినప్పటికీ ఫైనల్ చేరిన సూపర్‌నోవాస్, వెలాసిటీ

trailblzers won

ఐపీఎల్ 2022 మహిళల టీ20 ఛాలెంజ్‌లో మూడోది, మరియు చివరిదైన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వెలాసిటీ వర్సెస్ ట్రైల్‌బ్లేజర్స్ మధ్య జరగగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ట్రైల్‌బ్లేజర్స్ నిర్ణీత 20వ ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 190పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక 191పరుగుల లక్ష్య ఛేదనలో వెలాసిటీ జట్టు అద్భుతంగా పోరాడింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెలాసిటీ 9వికెట్లు కోల్పోయి 174పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక చివరికి 16పరుగుల తేడాతో ట్రైల్ బ్లేజర్స్ గెలిచింది. ట్రైల్ బ్లేజర్స్ గెలిచినప్పటికీ ఫైనల్ చేరుకోలేదు. ఇక ఈ టోర్నీల్లో సూపర్ నోవాస్, ట్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలా ఓ విజయం సాధించినా.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న సూపర్ నోవాస్, వెలాసిటీ టాప్ 2లో ఉండి.. ఫైనల్ చేరుకున్నాయి.

చెలరేగిన కిరణ్ నవిగిరే
ఆ జట్టు ప్లేయర్లలో సఫాలీ వర్మ (29పరుగులు 15బంతుల్లో 5ఫోర్లు), కిరణ్ నవిగిరే (69పరుగులు 34బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) బౌండరీలతో విధ్వంసం రేపారు. ముఖ్యంగా కిరణ్ నవిగిరే ఎడాపెడా సిక్సర్లు కొడుతూ ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లను బెంబేలెత్తించింది. ఆడుతున్నంత సేపు ఏమాత్రం బెదరకుండా హిట్టింగ్ చేసింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో చివర్లో చాలా తడబడింది. ట్రైల్‌బ్లేజర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, సల్మా, పూనమ్ యాదవ్, సోఫియా డంక్లీ, రేణుక సింగ్, మాథ్యూస్ తలా ఒక వికెట్ తీశారు.

అంతకుముందు రాణించిన ట్రైల్ బ్లేజర్స్
ఇక అంతకుముందు ట్రైల్‌బ్లేజర్స్ బ్యాటింగ్లో అద్భుతంగా ఆడింది. బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన (1పరుగు)కే ఔటవ్వడంతో అంతా నిరాశచెందారు. కానీ మంధాన అవుట్ అయినా ఆ ఎఫెక్ట్ ఏం పడకుండా సబ్బినేని మేఘన (73పరుగులు 47బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగి ఆడింది. అలాగే జెమిమియా రోడ్రిగ్స్ (66పరుగులు 44బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్) వీరవిహారం చేసింది. చివర్లో హైలీ మాథ్యుస్ (27పరుగులు 16బంతుల్లో 4ఫోర్లు), డంక్లీ (19పరుగులు 8బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్) చెలరేగడంతో ట్రైల్ బ్లేజర్స్ 190పరుగుల భారీ స్కోరు సాధించింది.

తుది జట్లు
ట్రైల్‌బ్లేజర్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), హేలీ మాథ్యూస్, జెమిమా రోడ్రిగ్స్, సోఫియా డంక్లీ, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (w), అరుంధతి రెడ్డి, సల్మా ఖాతున్, పూనమ్ యాదవ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్
వెలాసిటీ (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, నత్తకాన్ చంతమ్, యాస్తిక భాటియా(w), లారా వోల్వార్డ్ట్, దీప్తి శర్మ(కెప్టెన్), కిరణ్ నవ్‌గిరే, స్నేహ రాణా, రాధా యాదవ్, కేట్ క్రాస్, అయాబొంగా ఖాకా, సిమ్రాన్ బహదూర్

Story first published: Thursday, May 26, 2022, 23:20 [IST]
Other articles published on May 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X