న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దక్షిణాఫ్రికాను ఒకటి కాదు రెండు సార్లు ఆలౌట్ చేయగలం'

 This Indian attack has got ability to get 20 SA wickets: Umesh

హైదరాబాద్: 'దక్షిణాఫ్రికా టూర్‌కి మేం సిద్ధంగా ఉన్నాం. అందరూ అనుకుంటున్నట్టే అక్కడ బౌలింగ్ చేయడం కొంచెం కష్టమే. కానీ, మేం దానికి తగ్గట్టే తయారుగా ఉన్నాం. సిరీస్ మొత్తంలో రెండు సార్లు ఆలౌట్ చేయగలం సత్తా మాకుంది." అని భారత పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అన్నాడు.

మొహాలి వేదికగా రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఉమేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. 'ఉపఖండంలో మేం రాణించే విధంగా పక్కా ప్రణాళికతో ఉన్నాం. ఎటువంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవ్వకుండా మంచి ఫిట్‌నెస్‌ను ఉండేలా ప్రయత్నిస్తున్నామని' నొక్కి చెప్తున్నాడు.

'మేం ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే మ్యాచ్ ఆడబోతున్నాం. ఇదే తీరును దక్షిణాఫ్రికాలో కనబరుస్తాం' అని ఉమేశ్ యాదవ్ అన్నాడు. గడిచిన 14నెలల్లో జరిగిన 17 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఉమేశ్ యాదవ్ పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లు అన్నింటితో కలిపి 40 వికెట్లు తీసిన ఉమేశ్ దక్షిణాఫ్రికా టూర్‌ను గెలవాలనే కసితో ఉన్నామన్నాడు.

దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌లా అవుట్‌ స్వింగర్‌ నైపుణ్యమే తన బలమని వ్యాఖ్యానించాడు. ఇదే ప్రయోగిస్తాను కాకుండా ఇన్‌స్వింగర్‌కు ప్రయత్నించి తన బలహీనతను ప్రదర్శించను అని పేర్కొన్నాడు. ఇంతకుముందు జరిగిన విదేశీ పర్యటనల్లో బౌలర్లంతా యువకులమే కావడం ఇబ్బందిగా మారిందని వాపోయాడు. అప్పట్లో మాపైన ఉన్న భారీ అంచనాలు తీవ్ర ఒత్తిడిని కలగజేశాయని అభిప్రాయపడ్డాడు.

అలా కాకుండా ఈసారి తనతో సహా షమీ, ఇషాంత్, భువీ, బుమ్రాలు ఉండటం తనకెంతో ధైర్యాన్నిస్తుందని చెప్పాడు. ఆటలో ఉత్సుకతను అదుపులో ఉంచుకుంటూనే మంచి నేర్పు గల ప్రదర్శన చూపించనున్నామని తెలిపాడు. కాగా, యువ ఫేస్ బౌలర్ తో పాటుగా నెట్‌లో బౌలింగ్ చేసేందుకు మన హైదరాబాదీ బౌలర్ సిరాజ్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం విదితమే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 13, 2017, 10:53 [IST]
Other articles published on Dec 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X