న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: తొలి వన్డేలో మూడు రికార్డులు బద్దలు.. భారత్ పేరిట రెండు చెత్త రికార్డులు..!

These three records were broken in India loss against Bangladesh

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైనా.. బౌలర్లు ఈ మ్యాచ్‌లో దాదాపు గెలిపించినంత పని చేశారు. కానీ చివరి వికెట్ తీసుకోలేక పోవడంతో భారత్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు అసాధారణ పట్టుదల చూపించి మ్యాచ్‌లో విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్‌లో మూడు రికార్డులు బద్దలయ్యాయి.

భారత్ అత్యల్ప స్కోరు

బంగ్లా చేతిలో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కొన్ని చెత్త రికార్డులు తమ పేరిట లిఖించుకుంది. వాటిలో ఒకటి బంగ్లాపై అత్యల్ప స్కోరు. బంగ్లాదేశ్‌తో ఎప్పుడు ఆడినా భారత జట్టు మెరుగైన ప్రదర్శనే చేసింది. కానీ 2014లో బంగ్లా బౌలర్లు విజృంభించడంతో కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే స్టువర్ట్ బిన్నీ (6/4) ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మళ్లీ ఇప్పుడు బంగ్లాపై మరోసారి స్వల్ప స్కోరుకే భారత్ ఆలౌట్ అయింది. బంగ్లాపై భారత్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు.

షకీబల్ రికార్డు..

తొలి వన్డేల భారత జట్టు నడ్డి విరిచిన బౌలర్ షకీబల్ హసన్. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ అద్భుతంగా బౌలింగ్ చేసి, భారత్‌పై తన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో షకీబల్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబల్.. షేర్ ఎ బంగ్లా మైదానంలో 122 వికెట్లు తీసుకున్నాడు. ఇది షార్జా స్టేడియంలో వసీం అక్రమ్ తీసుకున్న వికెట్లకు సమానం. భారత్‌పై ఐదు వికెట్లు తీసుకున్న షకీబల్.. అక్రమ్‌ను దాటేసి, ఒక స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

అత్యధిక ఓటములు..

అత్యధిక ఓటములు..

భారత జట్టు వన్డే ఫార్మాట్‌లో చాలా బలంగా కనిపిస్తుంది. కానీ ఈ ఫార్మాట్‌లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్లలో భారత్ ఒకటని తెలుసా? బంగ్లా చేతిలో ఓటమి భారత్‌కు వన్డేల్లో 435వది. ఇప్పటి వరకు భారత జట్టు 1018 వన్డేలు ఆడి, వాటిలో 435 మ్యాచుల్లో ఓడింది. భారత్‌తోపాటు శ్రీలంక కూడా వన్డే ఫార్మాట్‌లో 435 ఓటములే మూటగట్టుకుంది. శ్రీలంక మొత్తం 878 వన్డేలు ఆడింది. వాటిలో 435 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఇలా వన్డే ఫార్మాట్‌లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్లుగా భారత్, శ్రీలంక నిలిచాయి. బంగ్లా చేతిలో ఓటమితో భారత్ కూడా శ్రీలంక సరసన చేరింది.

Story first published: Monday, December 5, 2022, 13:17 [IST]
Other articles published on Dec 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X