న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదివేలకు 81 పరుగుల అడుగుల దూరంలో కెప్టెన్ కోహ్లీ

Team India captain Virat Kohli 81 runs and complete totla scored 10,000 runs in Odis

హైదరాబాద్: ఛేజ్ మాస్టర్... రన్ మెషిన్ ఇలా ఎన్ని పేర్లతో అభిమానులు ముద్దుగా పిలుచుకున్నా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి తక్కువే. క్రీజులో అడుగుపెట్టాడంటే చాలు దూకుడుగా ఆడాల్సిందే. పరుగుల వరద పారించాల్సిందే. ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట అనేక రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ విశాఖ వన్డేలో మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు.

<strong>మరో రికార్డు: సచిన్, హెడెన్, జో రూట్‌ల ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ</strong>మరో రికార్డు: సచిన్, హెడెన్, జో రూట్‌ల ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ వన్డేలో విరాట్ కోహ్లీ మరో 81 పరుగులు చేస్తే కెరీర్‌లో 10,000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ప్రస్తుతం కోహ్లీ 212 వన్డేల్లో 58.69 యావరేజితో 9,919 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయి

వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయి

కాగా, వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్‌ 266 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. అయితే కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు ఆడింది 204 ఇన్నింగ్స్‌లే. దీనిని బట్టి చూస్తే సచిన్‌ కన్నా అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయి కోహ్లీ అందుకోనున్నాడు.

తొలి వన్డేలో 140 పరుగులు చేసిన కోహ్లీ

తొలి వన్డేలో 140 పరుగులు చేసిన కోహ్లీ

గువహటి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 140 పరుగులు చేయడంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. మూడేళ్ల పాటు వరుసగా 2,000పై చిలుకు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్‌ జాబితాలో విరాట్‌ కోహ్లీ చేరాడు. వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌, హెడెన్‌, జో రూట్‌ సరసన కోహ్లీ నిలిచాడు.

ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ

సచిన్ 1996-98 సంవత్సరాల మధ్య 2,000లకు పైగా పరుగులు సాధించాడు. మాథ్యూ హేడెన్‌ కూడా 2002-2004 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు సాధించాడు. జో రూట్‌ సైతం 2015-17 సంవత్సరాల మధ్య ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం 2015-18 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు చేశాడు.

తొలి వన్డేలో బౌండరీతో వన్డేల్లో 36వ సెంచరీ

తొలి వన్డేలో బౌండరీతో వన్డేల్లో 36వ సెంచరీ

తొలి వన్డేలో ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో బౌండరీతో కోహ్లీ తన 36వ సెంచరీని సాధించాడు. ఈ ఏడాది కోహ్లీకి ఇది నాలుగో వన్డే సెంచరీ కావడం విశేషం. 386 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. సచిన్‌కన్నా 40 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో 36, టెస్టుల్లో 24 సెంచరీలతో ఉన్న ఈ విరాట్ కోహ్లీ మొత్తంగా 60 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు.

50 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలురాయి

ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్‌ (71), కుమార సంగక్కర (63), జాక్వస్ కలిస్‌ (62) ముందున్నారు. తొలి వన్డేలో కోహ్లీ సాధించిన సెంచరీ ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది. ఇక, కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 14. 50 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఘనంగా స్వాగతం పలికిన హోటల్ సిబ్బంది

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ (22) తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. పాంటింగ్ 220 ఇన్నింగ్స్‌ల్లో ఈ సెంచరీలు చేశాడు. బుధవారం జరిగే రెండో వన్డే కోసం కోహ్లీ సేన సోమవారం ఉదయం విశాఖపట్నంలో అడుగుపెట్టింది. ఆటగాళ్లకు హోటల్‌ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వారిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

Story first published: Monday, October 22, 2018, 18:07 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X