న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి బ్రాడ్ విజృంభణ.. 129 పరుగులకే విండీస్ ఆలౌట్.. సిరీస్ ఇంగ్లండ్ సొంతం

Stuart Broad stars with 10 wickets as England beat West Indies in 3rd Test to clinch series

మాంచెస్టర్‌: మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్‌తో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ భారీ విజయాన్ని అందుకుంది. 390 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విండీస్‌.. 129 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 269 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ బారీ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 5 వికెట్లతో రాణించగా.. స్టువర్ట్‌ బ్రాడ్‌ మరోసారి 4 వికెట్లు తీశాడు. షై హోప్ (31), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (23), షమర్ బ్రూక్స్ (22) పరుగులు చేశారు. ఫలితంగా మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

 తన బ్యాటింగ్‌ విజయ రహస్యమేంటో చెప్పిన విరాట్ కోహ్లీ!! తన బ్యాటింగ్‌ విజయ రహస్యమేంటో చెప్పిన విరాట్ కోహ్లీ!!

చెలరేగిన వోక్స్‌ :

చెలరేగిన వోక్స్‌ :

ఓవర్ నైట్ స్కోర్ 10/2తో ఇదో రోజు ఆట కొనసాగించిన విండీస్ బ్యాట్స్‌మన్‌.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్ (19), షై హోప్, షమర్ బ్రూక్స్ తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. బ్రాత్‌వైట్ వికెట్ బ్రాడ్ తీయగా.. హోప్, బ్రూక్స్ వికెట్లను వోక్స్ పడగొట్టాడు. లంచ్ సమయానికి విండీస్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. అప్పటికీ విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 315 పరుగులు చేయాలి. ఒకవేళ డ్రా కోసం ఆడినా 5 వికెట్లతో రెండు సెషన్ల పాటు కాచుకోవాలి. అయితే లంచ్ అనంతరం మధ్యమధ్యలో చిరుజల్లుల కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై ఆట మొదలు కాగా.. వోక్స్‌ చెలరేగడంతో విండీస్ కొద్దిసమయంలోనే కుప్పకూలింది.

10 వికెట్లు తీయడం మూడోసారి:

10 వికెట్లు తీయడం మూడోసారి:

ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఇక విండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ స్టువర్ట్‌ బ్రాడ్‌ 6 కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీయడం బ్రాడ్‌కు ఇది మూడోసారి. స్టువర్ట్‌ బ్రాడ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.

క్రికెట్‌లో శుభారంభం:

క్రికెట్‌లో శుభారంభం:

నాలుగు నెలల కరోనా విరామం తర్వాత జరిగిన క్రికెట్‌లో శుభారంభం అదిరింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ సిరీస్‌ విజయవంతం కావడంతో ఇతర బోర్డులు కూడా బయో బబుల్ వాతావరణంపై దృష్టి పెట్టాయి. నాలుగు నెలల విరామం తర్వాత జరిగిన టెస్ట్ సిరీస్‌.. కాబట్టి అందరూ ఓ కన్నేసి ఉంచారు. మాములుగా అయితే వెస్టిండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ అంటే అంతగా ఆసక్తి ఉండేదికాదు.

పలు రికార్డులుకు వేదిక:

పలు రికార్డులుకు వేదిక:

ఈ సిరీస్‌ పలు రికార్డులుకు వేదికయింది. జో రూట్‌ గైర్హాజరీలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు ఈ సిరీస్‌ మధురానుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండో టెస్టులో 6 వికెట్లు, మూడో టెస్టులో ఫాస్టెస్ట్‌ ఆఫ్‌ సెంచరీతో పాటు 10 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక​ కెరీర్‌లో 500 వికెట్లు సాధించిన రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా.. ప్రపంచంలో 7వ బౌలర్‌గా నిలిచాడు.

Story first published: Tuesday, July 28, 2020, 21:46 [IST]
Other articles published on Jul 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X