స్మిత్‌కు నా సానుభూతిని తెలుపుతున్నా..: డుప్లెసిస్

Posted By:
Steve Smith ban harsh, says South Africa captain Faf Du Plessis

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ లో నిషేదానికి గురైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ స్పందించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించడం కఠిన చర్యంటూ అభిప్రాయపడ్డాడు. గురువారం జొహెన్నెస్‌బర్గ్‌లో మీడియాతో మాట్లాడిన డుప్లెసిస్ స్మిత్‌ను మంచి వ్యక్తిగా అభివర్ణించాడు.

వివాదం తర్వాత స్మిత్‌కు మనోధైర్యాన్ని ఇచ్చేలా ఇప్పుడే మెసేజ్ పెట్టానని చెప్పాడు. నా మనసు అంతరాల్లో స్మిత్ గురించి తీవ్ర వేదనకు గురయ్యాను. అందుకే అతడికి మెసేజ్ పెట్టానని గతంలో రెండుసార్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి, ఫైన్‌తో తప్పించుకున్న డుప్లెసిస్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్నీ చూడాలని కూడా ఉండదని సఫారీ కెప్టెన్ తెలిపాడు.

గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్బంగా.. డుప్లెసిస్ నిబంధనలకు విరుద్ధంగా మింట్ ద్వారా బంతిని మెరిసేలా చేస్తూ.. దొరికి పోయాడు. మ్యాచ్ ముగిశాక వార్నర్ మాట్లాడుతూ.. ఈ విషయంలో నేనేం కామెంట్ చేయను. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్లుగా మేం తలెత్తుకొని ఉంటాం. మా జట్టులో ఎవరైనా అలా చేస్తే.. తీవ్ర నిరాశకు లోనవుతామన్నాడు. ఇలా మాట్లాడిన వార్నర్ గురించి ఏమీ పట్టించుకోకుండా .. ఇప్పుడు డుప్లెసిస్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ఓదార్చేలా సానుకూలంగా మాట్లాడటం గమనార్హం.

స్మిత్ గురించి స్పందించిన డుప్లెసిస్.. 'రానున్న రోజులు స్మిత్‌కు చాలా కష్టంగా ఉంటాయి, అతడు ధైర్యంగా ఉండాలని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నత విలువల కోసం స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించింది. కానీ ఆ ముగ్గురిపై తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయి' అని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై సానుభూతి చూపిన డుప్లెసిస్.. చివరి టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ ముగిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 9:49 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి