న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పది నెలల వ్యవధిలో రెండోసారి.. శ్రీలంక స్పిన్నర్‌ అఖిల దనంజయపై నిషేధం!!

Sri Lanka spinner Akila Dananjaya banned from bowling in international cricket for 12 months

దుబాయ్: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేటు వేసింది. ధనంజయపై 12 నెలలు (ఏడాది) పాటు నిషేధం విదిస్తున్నట్లు గురువారం ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. స్వతంత్ర విచారణ తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ధనంజయ బౌలింగ్ శైలి ఉండడంతో అతనిపై ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతో పది నెలల వ్యవధిలోనే ధనంజయ రెండు సార్లు వేటుకు గురైనట్టయింది.

<strong>కెప్టెన్ మణిందర్ మెరుపులు.. హర్యానాపై బెంగాల్ విజయం</strong>కెప్టెన్ మణిందర్ మెరుపులు.. హర్యానాపై బెంగాల్ విజయం

ఫిబ్రవరిలో బౌలింగ్‌కు అనుమతి:

ఫిబ్రవరిలో బౌలింగ్‌కు అనుమతి:

2018 డిసెంబరులోనే ఐసీసీ అఖిల ధనంజయపై తొలిసారి నిషేధం విధించింది. అయితే బౌలింగ్ శైలిలో మార్పులు చేసుకోవడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బౌలింగ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ ఆగస్టు 14 నుంచి 18 మధ్య శ్రీలంకలో కివీస్‌తో జరిగిన టెస్టు సందర్భంగా అఖిల బౌలింగ్‌పై మళ్లీ ఫిర్యాదు అందింది. ఆగస్టు 29న చెన్నైలో బౌలింగ్ యాక్షన్‌ పరీక్షకు హాజరు కాగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది.

ఏడాది పాటు నిషేధం:

ఏడాది పాటు నిషేధం:

ఒకే ఏడాదిలో రెండోసారి ఫిర్యాదు అందడంతో ఐసీసీ ఈసారి ధనంజయపై ఏడాది పాటు నిషేధం విధించింది. నిషేధం పూర్తయిన తర్వాత అతడు మరోసారి ఐసీసీని సంప్రదించి.. బౌలింగ్ యాక్షన్ పరీక్షకు హాజరై ఆమోదం పొందాల్సి ఉంటుంది. 'రెండేళ్ల వ్యవధిలో రెండోసారి నిబంధనలకు అనుగుణంగా బౌలింగ్‌ లేకపోవడంతో దనంజయపై ఏడాది పాటు బౌలింగ్‌ వేయకుండా నిషేధం విధించాం. నిషేధం అనంతరం ఐసీసీని సంప్రదించి బౌలింగ్ యాక్షన్ పరీక్షకు హాజరవ్వాలి' అని ఐసీసీ పేర్కొంది.

విలియమ్సన్‌పై కూడా ఫిర్యాదు:

విలియమ్సన్‌పై కూడా ఫిర్యాదు:

గాలె వేదికగా న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో లంక రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ మూడు ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసాడు. విలియమ్సన్‌ బౌలింగ్‌ శైలి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదు అందింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆటగాళ్లు దిముత్‌ కరుణరత్నె (122) సెంచరీతో చెలరేగగా.. తిరిమానె (64) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆరు వికెట్ల తేడాతో లంక విజయం సాధించింది.

Story first published: Friday, September 20, 2019, 9:42 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X