న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంతి వేగం 146కేపీహెచ్.. ధావన్ బ్యాట్ బద్దలు (వీడియో)

ICC Cricket World Cup 2019 : Kagiso Rabada Breaks Shikhar Dhawan’s Bat With Thunderbolt || Oneindia
 South Africa Bowler Kagiso Rabadas thunderbolt breaks Shikhar Dhawans bat

దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడ ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. రబడ బంతిని 150కేపీహెచ్ వేగంకు పైగా వేయగలడు. రబడ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి టాప్ బ్యాట్స్‌మన్‌లు సైతం తడబడతారు. ఐపీఎల్-12లో అద్భుత ప్రదర్శన చేసిన రబడ.. అదే ఫామ్ ప్రపంచకప్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. కచ్చితమైన వేగం, వైవిధ్య బంతులతో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. బ్యాట్లను కూడా విరగొడుతున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడింది. 228 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. తొలి ఓవర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వేయగా.. అనంతరం పేస్ బౌలర్లు కాగిసో రబడ, క్రిస్‌ మోరిస్‌లు కొనసాగించారు. ఈ ఇద్దరు నిప్పులు చెరిగే బంతులతో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టారు.

ఈ క్రమంలో నాలుగో ఓవర్ చివరి బంతిని రబడ వేయగా.. ధావన్ షాట్ ఆడే ప్రయత్నం చేసాడు. బంతి వేగం 146కేపీహెచ్ ఉండడంతో.. ధావన్ బ్యాట్ కింది భాగం విరిగింది. విరిగిన ముక్కను చూసి ధావన్ నవ్వుకున్నాడు. కిందపడిన ముక్కను కీపర్ డీకాక్.. ధావన్‌కు ఇచ్చాడు. అనంతరం ధావన్ కొత్త బ్యాట్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో అతను 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఈ విషయమై టీంఇండియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు కామెంటరీ బాక్స్‌లో మాట్లాడుకున్నారు. 'బ్యాట్‌ కొసభాగం పలుచగా ఉండడంతో ఒక్కోసారి ఇలా జరుగుతుంది. కానీ.. సచిన్‌ బ్యాట్‌ మాత్రం విరిగిపోదు' అని సచిన్‌పై గంగూలీ పంచ్ వేశారు. 'నిజమే ఆయన బ్యాట్‌ ఎలా విరిగిపోతుందిలే దాదా' అని సెహ్వాగ్‌ అన్నారు. బదులుగా సచిన్ కూడా కౌంటర్‌ ఇచ్చారు. ప్రపంచకప్‌ 2019 కోసం కామెంటేటర్‌గా సచిన్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, June 6, 2019, 14:55 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X