న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అక్తర్ సంచనల వ్యాఖ్యలు.. క్రికెట్‌లో కొత్త చోకర్స్‌ వచ్చారు!!

Shoaib Akhtar says Looks like New Zealand have done specialisation in losing

కరాచీ: సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ ప్రదర్శనపై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. సూపర్‌ ఓవర్‌లో ఓడిపోవడంలో కివీస్ ఏదైనా స్పెషలైజేషన్ చేసినట్టు అనిపిస్తోందని ఆయన అన్నారు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లను 'టై' చేసుకోవడం, ఇక సూపర్‌ ఓవర్‌లో ఓడిపోవడం కివీస్‌కు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. శుక్రవారం టీమిండియాతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్‌ సూపర్‌ ఓవర్‌లో మరోసారి ఓటమిపాలవ్వడంతో అక్తర్ పైవిధంగా స్పందించారు.

<strong>బిగ్‌బాష్‌లో హైడ్రామా.. హిట్‌ వికెట్‌ సంబరాలు.. కానీ నాటౌట్‌ (వీడియో)</strong>బిగ్‌బాష్‌లో హైడ్రామా.. హిట్‌ వికెట్‌ సంబరాలు.. కానీ నాటౌట్‌ (వీడియో)

ఏదైనా స్పెషలైజేషన్ చేసినట్టుంది

ఏదైనా స్పెషలైజేషన్ చేసినట్టుంది

అక్తర్ తన యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడుతూ... 'మీరు ఏమైనా కొత్త చోకర్సా?. న్యూజిలాండ్‌ జట్టు పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఎనిమిది సూపర్‌ మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచారంటే.. న్యూజిలాండ్‌ జట్టును ఏమనాలి. కివీస్ పరాజయాల్ని చవిచూడటంలో స్పెషలిస్టులా కనిపిస్తోస్తున్నారు. సూపర్‌ ఓవర్‌లో ఓడిపోవడంలో కివీస్ ఏదైనా స్పెషలైజేషన్ చేసినట్టుంది నాకు అనిపిస్తోంది. ఇప్పుడు కొత్త చోకర్స్‌ వచ్చినట్లే కనబడుతోంది' అని అన్నారు.

కొత్త చోకర్స్‌

కొత్త చోకర్స్‌

'కివీస్ ఒక మంచి జట్టు అయితే 166 పరుగుల టార్గెట్‌ను ఎందుకు ఛేదించలేకపోయింది. 166 పరుగులు సునాయాసమైన టార్గెట్‌. ఒక ఓవర్లో 7 పరుగులు చేయలేకపోయారు. అది టీ20 ఫార్మాట్‌లో. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయారు. ఒత్తిడిని అధిగమించలేక బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేశారు. కొత్త చోకర్స్‌గా అవతరించారా?. కఠిన పరిస్థితుల్లో చతకిలబడే మరో దక్షిణాఫ్రికా జట్టు తరహాలో కనిపిస్తున్నారు' అని అక్తర్ తీవ్ర విమర్శలు చేసారు. క్రికెట్‌లో చోకర్స్‌ అనగానే గుర్తుకువచ్చే పేరు దక్షిణాఫ్రికా అని తెలిసిన విషయమే.

ఏడు నెలల్లో నాలుగోసారి

ఏడు నెలల్లో నాలుగోసారి

గత ఏడు నెలల్లో కివీస్‌ వరుసగా నాలుగోసారి సూపర్‌ ఓవర్‌లో ఓడిపోయింది. బుధవారం టీమిండియాతో జరిగిన మూడో టీ20లోనూ ఆ జట్టు విఫలమైన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ అదే ఫలితం పునరావృతమైంది. భారత్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ చివరి రెండు ఓవర్లలో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. 10 పరుగులే చేసి మరోసారి సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.

ఒక్కసారి మాత్రమే విజయం

ఒక్కసారి మాత్రమే విజయం

న్యూజిలాండ్‌ మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు సూపర్‌ ఓవర్‌కు వెళ్లగా.. కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలైన కివీస్‌.. తర్వాత అదే జట్టుతో నవంబర్‌లో స్వదేశంలో జరిగిన ఓ టీ20లోనూ బోల్తా కొట్టింది. న్యూజిలాండ్‌ 2010లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సూపర్‌ ఓవర్‌లో గెలుపొందింది. ఇక ఆ తర్వాత జరిగిన ఏ సూపర్‌ ఓవర్‌లోనూ విజయం సాధించలేదు.

Story first published: Saturday, February 1, 2020, 16:07 [IST]
Other articles published on Feb 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X