న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా

Shikhar Dhawan, Rohit Sharma Take India To Steady Start

సిడ్నీ: చివరి టీ20లో ఆస్ట్రేలియా కసిగా ఆడింది. నెమ్మదిగా టర్న్‌ అవుతున్న పిచ్‌పై భారీ స్కోరు చేయాలన్న పట్టుదలను ప్రదర్శించింది. ఎలాగైనా సిరీస్‌ను 2-0తో గెలవాలన్న ఉద్దేశంతో బ్యాట్స్‌మెన్‌ నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించారు. భారత ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా బంతితో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా పరుగులు సమర్పించుకోని విమర్శలపాలైన కృనాల్‌.. ఈ మ్యాచ్‌లో రాణించి లెక్కసరిచేశాడు.

భారత్‌కు 165 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా టీమిండియా జాగ్రత్తపడింది. కాగా చివరి ఐదు ఓవర్లలో సగటున 8 పరుగులు ఇవ్వడంతో స్కోరు పెరిగింది. డీఆర్సీ షార్ట్‌ (33), ఆరోన్‌ ఫించ్‌ (28) రాణించారు. కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో 4/36తో అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఫించ్‌, షార్ట్‌ తొలి వికెట్‌కు 68 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ క్రమంలో ఫించ్‌ను ఔట్‌చేయడం ద్వారా కుల్‌దీప్‌‌ ఆ జోడీని విడదీసినట్లు అయింది. జట్టు స్కోరు 73 వద్ద వరుస బంతుల్లో షార్ట్‌, మెక్‌డెర్మాట్‌ (0)ను కృనాల్‌ పెవిలియన్‌ పంపించాడు. అదే జోరులో 90 వద్ద మాక్స్‌వెల్‌ (13), 119 వద్ద అలెక్స్‌ కారీ (27)ను ఔట్‌ చేశాడు. దీంతో ఆసీస్‌ స్కోరు వేగం మందగించింది. క్రిస్‌లిన్‌ (13), స్టొయినిస్‌ (25 నాటౌట్‌) క్రీజులో ఉండటంతో చివరి ఐదు ఓవర్లలో పరుగులు చేస్తారన్న ఆత్మవిశ్వాసం కంగారూల్లో కనిపించింది.

1
43622

జట్టు స్కోరు 131వద్ద అనవసర పరుగుకు ప్రయత్నించి లిన్‌ రనౌట్‌ అయ్యాడు. చివర్లో భువి, బుమ్రా, కృనాల్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌, కౌల్టర్‌ నైల్‌ (13 నాటౌట్‌) బౌండరీలు బాది స్కోరును 164/6కు పెంచారు. కానీ.. భువీ, ఖలీల్, బుమ్రా మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోగా.. అందరి ఎకానమీ 8.25కి పైనే ఉండటం విశేషం. ఫీల్డింగ్‌ సైతం పేలవంగా ఉంది. ఆపగలిగే బౌండరీలనూ అడ్డుకోలేదు.

Story first published: Sunday, November 25, 2018, 15:45 [IST]
Other articles published on Nov 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X