న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకింగ్స్: ధావన్ దూకుడు..భూమ్.. బుమ్ భువనేశ్వర్

Shikhar Dhawan, Bhuvneshwar Kumar Make Significant Movement in ICC Rankings

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆతిథ్య జట్టుపై భారత జట్టు విజృంభించి రెండు సిరీస్‌లు గెలిచింది. మొదటి సిరీస్ టెస్టుల్లో రెండు మ్యాచ్ లు మినహాయించి పర్యటనలో అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ అద్వితీయమైన ప్రదర్శన చేసింది. జట్టు విజయంలో బౌలర్లదే ప్రధాన పాత్ర అంటూ కెప్టెన్ కోహ్లీ నుంచి పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం కొనియాడారు.

ధావన్, భువనేశ్వర్:

ధావన్, భువనేశ్వర్:

ఆ విషయం ఐసీసీ ర్యాంకింగ్స్ రూపంలో నిరూపితమైంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌, బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలుచుకోవడంలో వీరివురూ కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే.

అదరగొట్టిన ధావన్:

అదరగొట్టిన ధావన్:

మూడు టీ20 మ్యాచ్‌లలో 143 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన భారత ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ టీ20ల్లో 14 స్థానాలను మెరుగుపరుచుకొని కెరీర్‌లోనే అత్యుత్తమంగా 28వ స్థానంలో నిలిచాడు. అటు ఇటు తడబడి రెండు సార్లు రనౌట్ అయినా స్కోరుతో మాత్రం మెరుగ్గా రాణించాడు.

భువీ మాయాజాలం;

భువీ మాయాజాలం;

ఇక బౌలింగ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' కైవసం చేసుకున్న బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా 20 స్థానాలను మెరుగుపరుచుకొని బౌలర్లలో 12వ స్థానానికి చేరుకున్నాడు.

మూడో స్థానంలో భారత్:

మూడో స్థానంలో భారత్:

ఇక టీ20 సిరీస్‌ గెలుచుకున్న టీమిండియాకు ఒక పాయింట్‌ వచ్చి చేరింది. దీంతో 122 పాయింట్లతో మూడో స్థానంలోనే భారత్ కొనసాగుతుంది. మరోవైపు పాకిస్థాన్‌ 126 అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఆరో స్థానంలో కెప్టెన్ కోహ్లీ:

ఆరో స్థానంలో కెప్టెన్ కోహ్లీ:

టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ మన్రో అగ్రస్థానంలో ఉండగా, భారత సారథి విరాట్‌ కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో ఆఫ్గానిస్థాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ మొదటి స్థానంలో ఉండగా, బుమ్రా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Monday, February 26, 2018, 11:19 [IST]
Other articles published on Feb 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X