న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కోల్‌కతా ఓటమి: షారుక్ ఖాన్ స్పెషల్ మెసేజ్

Shah Rukh Khan Posts Special Message For Sourav Ganguly After KKRs Loss To Delhi Capitals

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా ఉన్న సౌరవ్ గంగూలీ పట్ల కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని షారుక్ ఖాన్‌ తన అభిమానాన్ని చాటుకున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

షారుక్ ఖాన్ తన ట్విట్టర్‌లో

మ్యాచ్ అనంతరం షారుక్ ఖాన్ తన ట్విట్టర్‌లో "శుభ్‌మన్‌ గిల్‌, రసెల్‌ అద్భుతంగా ఆడారు. మ్యాచ్‌లో ఓడిపోవడం హృదయాన్ని బాధపెట్టే అంశమే, బౌలింగ్‌ కారణంగా ఓడిపోవడం బాధ కలిగించింది. ఈ మ్యాచ్‌లో సానుకూల అంశం ఏదైనా ఉందంటే అది దాదా(గంగూలీ) మాత్రమే. ఈడెన్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టువైపు ఆయన ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అభినందనలు" అని ట్వీట్ చేశాడు.

షారుక్ ట్వీట్‌కు ఆ జట్టు అభిమానులు ఫిదా

షారుక్ ట్వీట్‌కు ఆ జట్టు అభిమానులు ఫిదా

షారుక్ ఖాన్ ట్వీట్‌కు ఆ జట్టు అభిమానులు ఫిదా అయ్యారు. "ఒక్క మ్యాచ్‌ ఓడిపోయినంత మాత్రాన మన సూపర్‌ టీమ్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. ఐపీఎల్‌ ట్రోఫీ మన సొంతమవుతుంది. దాదాపై అభిమానం చాటుకుని ‘ట్రూ కింగ్‌ ఇన్‌ ఆల్‌ సెన్స్‌' అని నిరూపించుకున్నావ్‌" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

39 బంతుల్లో 65 పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్

39 బంతుల్లో 65 పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ 39 బంతుల్లో 65 (7 ఫోర్లు, 2 సిక్సులు), ఆండ్రీ రస్సెల్ 21 బంతుల్లో 45 (3 ఫోర్లు, 4 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి ఢిల్లీ క్యాపిటల్స్

అనంతరం 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగుు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ 63 బంతుల్లో 97 (11 ఫోర్లు, 2 సిక్సులు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు.

Story first published: Saturday, April 13, 2019, 14:52 [IST]
Other articles published on Apr 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X