న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: ఇద్దరి మధ్య పోటా పోటీ, 8 పరుగుల దూరంలో రోహిత్!

India vs South Africa,3rd T20I:Rohit 8 Runs Away From World Record In 3rd T20I
Rohit Sharma 8 runs away from World record in 3rd T20I at Bengaluru

హైదరాబాద్: స్వదేశంలో సఫారీలతో జరుగుతున్న టీ20 సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. భారత జట్టును విజయ పథంలో నడిపించే క్రమంలో వీరిద్దరూ పరుగుల పరంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆఖరిదైన మూడో టీ20 ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మొహాలీ టీ20కి ముందు ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉంటే, విరాట్ కోహ్లీ(72 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి రోహిత్ శర్మను అధగమించాడు. ప్రస్తుతం టీ20ల్లో కోహ్లీ 71 ఇన్నింగ్స్‌ల్లో 2,441 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

అందంతో మతి పొగొడుతుంది: దీపికా పల్లికల్ W/o దినేశ్ కార్తీక్అందంతో మతి పొగొడుతుంది: దీపికా పల్లికల్ W/o దినేశ్ కార్తీక్

97 ఇన్నింగ్సుల్లో 2,434 పరుగులు

97 ఇన్నింగ్సుల్లో 2,434 పరుగులు

ఇక, రోహిత్ శర్మ 97 ఇన్నింగ్సుల్లో 2,434 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ కేవలం 8 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. అయితే, ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మూడో టీ20లో కోహ్లీ రికార్డును బద్దలు చేసేందుకు రోహిత్‌ శర్మ సిద్ధంగా ఉన్నాడు.

రెండో టీ20లో 12 పరుగులు చేసిన రోహిత్

రెండో టీ20లో 12 పరుగులు చేసిన రోహిత్

మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ... మూడో టీ20లో ఓపెనర్ కాబట్టి 8 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డుని బద్దలు కొడతాడు. అయితే, రోహిత్ తక్కువ స్కోరుకే పరిమితమైతే విరాట్ కోహ్లీ రికార్డు పదిలంగా ఉంటుంది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో ఎలాగూ విరాట్ కోహ్లీ వస్తాడు కాబట్టి తన స్కోరుని మరింత పెంచుకుంటాడు.

ధావన్ టీ20ల్లో 6,996 పరుగులు

ధావన్ టీ20ల్లో 6,996 పరుగులు

మరో ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20ల్లో 6,996 పరుగులు చేశాడు. మరో నాలుగు పరుగులు చేస్తే టీ20ల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అదే గనుక జరిగితే టీ20ల్లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్ మన్‌గా శిఖర్ ధావన్ నిలుస్తాడు. ధావన్‌కు ముందు కోహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు ఈ ఘనత సాధించారు.

దక్షిణాఫ్రికాపై స్వదేశంలో

దక్షిణాఫ్రికాపై స్వదేశంలో

ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై స్వదేశంలో టీమిండియా టీ20 సిరీస్‌ను గెలవని నేపథ్యంలో మూడో టీ20ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Story first published: Saturday, September 21, 2019, 15:56 [IST]
Other articles published on Sep 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X