న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ricky Ponting : ఒకప్పటి ఆస్ట్రేలియా యోధులతో రికీ పాంటింగ్ ఫోటో.. వార్నర్, పంత్ కామెంట్లు

Ricky Ponting Shares A Photo With His Former Teammates, Warner and Pant commented

లెజెండరీ ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ తన మాజీ సహచరులు బ్రెట్ లీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హాడెన్ తదితరులతో కలిసి ఆదివారం ఇన్‌స్టాలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే పాంటింగ్ పెట్టిన చిత్రానికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అయిన రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్‌ తమ కామెంట్లు చేశారు. వార్నర్.. 'మిస్ యు రికీ' అని కామెంట్ చేయగా.. పంత్ 'అందరు బాస్‌లు ఒకే దగ్గర కలిశారుగా' అంటూ కామెంట్ చేశాడు.

వచ్చే నెల సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో పాంటింగ్ ఆడట్లేదు. అతని మాజీ సహచరులు అయిన బ్రెట్ లీ, షేన్ వాట్సన్, మిచెల్ జాన్సన్ మాత్రం ఆడనున్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ప్రారంభానికి ముందు ఈ ప్రత్యేక మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

ఏ టోర్నీలోనైనా భారత్‌ను ఓడించడం చాలా టఫ్

ఏ టోర్నీలోనైనా భారత్‌ను ఓడించడం చాలా టఫ్

ఇక యూఏఈలో జరిగే 2022 ఆసియాకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్ గురించి కూడా పాంటింగ్ తన స్పందనను తెలియజేశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో 10వికెట్ల భారీ తేడాతో పాకిస్థాన్ ఇండియాపై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక ఆ పరాజయానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది. అయితే భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడి టోర్నీకి దూరమవడంతో భారత బౌలింగ్ విభాగానికి కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. అయినప్పటికీ భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు కష్టమని పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

భారతే గెలుస్తుంది

భారతే గెలుస్తుంది

'పాకిస్థాన్‌ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్‌లో విజయం ఎవరిదనే విషయంలో నేను భారత్‌‌నే పేర్కొంటాను. అలా అని పాకిస్తాన్ అంత చులకన చేసే జట్టేమి కాదు. ఆ జట్టు కూడా ప్రస్తుతం చాలా టఫ్‌గా ఉంది. సూపర్ స్టార్ ప్లేయర్లతో పాక్ ప్రస్తుతం దుర్భేద్యంగా ఉంది. అయినా కానీ కేవలం ఆసియా కప్‌లోనే కాదు.. ఏ టోర్నీలోనైనా భారత్‌ను ఓడించడం ఎల్లప్పుడూ కష్టమే.. రాబోయే టీ20 ప్రపంచకప్ విషయంలో కూడా భారత్ చాలా టఫెస్ట్ టీం అని నేను అనుకుంటున్నాను.

వారి బ్యాటింగ్ మరియు బౌలింగ్ డెప్త్ కచ్చితంగా ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉంటుంది. ఆసియా కప్‌ భారత్ గెలుస్తుందని నేను భావిస్తున్నాను' అని రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్‌లో అన్నారు.

ఇండియా వర్సెస్ పాక్.. ఆసీస్ వర్సెస్ ఇంగ్లాండ్ సేమ్

ఇండియా వర్సెస్ పాక్.. ఆసీస్ వర్సెస్ ఇంగ్లాండ్ సేమ్

ఇక నేను చిరకాల ప్రత్యర్థుల గురించి ఆలోచించినప్పుడు.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ తలపడే యాషెస్ టెస్ట్ సిరీస్ తొలుత గుర్తుకొస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అది టఫ్ అండ్ టఫ్ అని నేను అనుకుంటాను. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందని చెబుతాను. ప్రస్తుతం ఈ రెండు టీంలు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి కానీ.. టెస్ట్ మ్యాచ్‌లు ఆడినా కూడా ఈ జట్ల మధ్య చాలా టఫ్ పోటీ ఉంటుందని' పాంటింగ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, August 15, 2022, 22:34 [IST]
Other articles published on Aug 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X