30 మ్యాచ్‌ల తర్వాత పాంటింగ్ ఎంపిక చేసిన ఐపీఎల్ "Best XI" జట్టు

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో దాదాపుగా సగం మ్యాచ్‌లు ముగిశాయి. దీంతో ఐపీఎల్‌లో రాణిస్తోన్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐపీఎల్‌లో తన "Best XI" జట్టుని ఎంపిక చేశాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

42 ఏళ్ల రికీ పాంటింగ్ అంతకముందు కోల్‌‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఐపీఎల్‌లో ఆడాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్ జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. పాంటింగ్ ఎంపిక చేసిన జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను నియమించాడు.

ఐపీఎల్ పదో సీజన్‌లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. శుక్రవారం (ఏప్రిల్ 28)తో ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ టోర్నీలో 333 పరుగులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. 376 పరుగులతో గంభీర్ మొదటి స్ధానంలో ఉన్నాడు.

Ricky Ponting picks his IPL 2017 'Best XI' after 30 matches

రైనా 300: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు (ఫోటోలు)

పాంటింగ్ ఎంపిక చేసిన జట్టులో నలుగురు భారత క్రికెటర్లకు చోటు కల్పించాడు. సురేశ్ రైనా, నితీశ్ రాణా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్‌లకు మాత్రమే చోటు కల్పించాడు. డేవిడ్ వార్నర్ తో ఓపెనర్‌గా గంభీర్‌ను కాదని దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లాకు ఎంచుకున్నాడు.

ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న సురేశ్ రైనాపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. 'గత 5 లేదా 6 సీజన్ల నుంచి ఐపీఎల్‌లో రైనా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌గా నిలుస్తున్నాడు' అని పాంటింగ్ తెలిపాడు.

30 మ్యాచ్‌ల తర్వాత పాంటింగ్ ఎంపిక చేసిన "Team of IPL":

1. Hashim Amla (Kings XI Punjab) - South Africa
2. David Warner (Sunrisers Hyderabad) (Captain) - Australia
3. Suresh Raina (Gujarat Lions)
4. Jos Buttler (Mumbai Indians) (Wicketkeeper) - England
5. Nitish Rana (Mumbai)
6. Glenn Maxwell (Kings XI Punjab) - Australia
7. Chris Morris (Delhi Daredevils) - South Africa
8. Harbhajan Singh (Mumbai)
9. Rashid Khan (Sunrisers Hyderabad) - Afghanistan
10. Bhuvneshwar Kumar (Hyderabad)
11. Mitchell McCleneghan (Mumbai) - New Zealand

Story first published: Saturday, April 29, 2017, 17:35 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి