Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పాపం.. భారీ సిక్సర్‌కు తాత‌ ముఖం పగిలింది! రక్తగాయం!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన భారీ సిక్సర్‌కు ఓ అభిమాని ముఖం పగిలింది. తీవ్ర రక్తస్రావమైంది.

బంతి ధాటికి సుమారు 60-70 ఏళ్ల వయసుండే సదరు అభిమాని ముఖం రక్తమైంది. పక్కనే ఉన్న మరో అభిమాని అతన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రాజస్థాన్ రాయల్స్ పేసర్ నండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని బర్గర్ గంటకు 140.8 కీలోమీటర్ల వేగంతో వేసిన బంతిని ప్రియాన్ష్ ఆర్య అంతేవేగంతో డీప్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. దాంతో ప్రేక్షకుల గ్యాలరీలోకి దూసుకొచ్చిన బంతి వృద్ద అభిమాని ముఖానికి బలంగా తాకింది.

Fan Injured After Being Hit by Priyansh Arya Massive Six During PBKS vs RR Clash in IPL 2026
Photo Credit: twitter (X)

దాంతో సదరు అభిమానికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. హెల్మెట్స్ ధరించి మ్యాచ్‌లకు వెళ్లాలని, సిక్సర్ల ధాటికి అభిమానులు గాయపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్య(11 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్‌తో 29) దూకుడుగా ఆడినా.. పంజాబ్ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. పేలవ బౌలింగ్‌ ప్రదర్శనతో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.

బొమ్మ ట్రక్కుతో ఆడుకున్నట్టే ఆడాను: డొనోవన్ ఫెరీరా

బొమ్మ ట్రక్కుతో ఆడుకున్నట్టే ఆడాను: డొనోవన్ ఫెరీరా

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. డోనోవన్ ఫెర్రెరియా(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/36) మూడు వికెట్లు తీయగా..అర్ష్‌దీప్ సింగ్(1/68) ఒక వికెట్ తీసారు. లాకీ ఫెర్గూసన్(0/57), అర్ష్‌దీప్ సింగ్ ధారళంగా పరుగులివ్వడం పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

IPL 2026: ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల టికెట్లను ఫ్రీగా పంచుతున్నారు!

IPL 2026: ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల టికెట్లను ఫ్రీగా పంచుతున్నారు!
Story first published: Wednesday, April 29, 2026, 11:05 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+