బొమ్మ ట్రక్కుతో ఆడుకున్నట్టే ఆడాను: డొనోవన్ ఫెరీరా
చిన్నప్పుడు బొమ్మ ట్రక్కుతో ఆడినట్లే ఆడి మ్యాచ్‌ను ముగించానని రాజస్థాన్ రాయల్స్ ఫినిషర్ డొనోవన్ ఫెరీరా అన్నాడు. శుభమ్ దూబే సహకారంతోనే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన సాధ్యమైందని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్)తో కలిసి డోనోవన్ ఫెరీరా(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్రపోషించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించారు. దాంతో ఫెరీరాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ప్రతి బాల్ బాదడం క్రికెట్ కాదు..
ఈ సందర్భంగా మాట్లాడిన ఫెరీరా.. తమ గెలుపు రహస్యం గురించి వివరించాడు. వరుసగా వికెట్లు పడుతున్నా మ్యాచ్ గెలిపిస్తామనే ధీమాకు గల కారణాలను తెలియజేశాడు. 'ఇది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్. చిన్నప్పుడు బొమ్మ ట్రక్కుతో ఆడుకునేటప్పుడు నా మనసు ఎంత ప్రశాంతంగా ఉండేదో.. ఇప్పుడు కూడా అలాంటి అనుభూతే కలుగుతోంది. బంతి బంతికి నా ఆటను ప్లాన్ చేసుకున్నాను.
ఏది ఏమైనా సానుకులంగా ఉండాలి. ఈ స్కోర్‌ను ఛేదించడం అంత కష్టం కాదని నా సహచర బ్యాటర్లకు చెప్పాను. గుడ్డిగా ప్రతీ బంతి బాదేందుకు ప్రయత్నించకుండా.. లెక్కలతో కూడిన ఆటను ఆడుతూ ఇంటెంట్ చూపించాలని, మంచి క్రికెటింగ్ షాట్లు ఆడుదామన్నాను. అతిగా ఆలోచించకుండా బంతి బంతికి ఆడుతూ ముందుకు వెళ్లడంతో ఒత్తిడిని అధిగమించాం. ఛేదించాల్సిన రన్ రేట్ 10, 12 పరుగులు మాత్రమేనని, ఒక మంచి ఓవర్ పడితే ఆట ఈజీ అయిపోతుందని నాకు నేను తరుచూ చెప్పుకున్నాను.

శుభమ్ సహకారంతో...
అదృష్టవశాత్తూ.. శుభమ్ వచ్చి నా మీద ఉన్న ఒత్తిడిని చాలా వరకు తగ్గించాడు. అతను కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. నేను వికెట్ కోల్పోకుండా క్రీజులో ఉంటే లక్ష్యాన్ని అందుకోగలమని నాకు తెలుసు. అదృష్టవశాత్తూ లాకీ బౌలింగ్‌లోనే విజయం దక్కింది. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉండాలంటే మ్యాచ్‌లు గెలవడం ముఖ్యం. ప్రస్తుతం మేం టాప్-4లో ఉన్నాం. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీ.. కాబట్టి వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలని మాకు మేం గుర్తు చేసుకుంటూ ఉంటాం.
ఎప్పుడూ ఓపెనర్లపై ఆధారపడలేం..
ఎప్పుడూ ఓపెనర్ల మీద మాత్రమే ఆధారపడలేము. వారు మాకు మంచి ఆరంభాలను ఇస్తున్నారు. నేను బంతిని బాగా హిట్ చేస్తున్నందుకు, శుభమ్ వచ్చి తన వంతు కృషి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జైస్వాల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ప్రారంభ ఓవర్లలో మంచి పునాది వేస్తున్నారు. కానీ అది మీ రోజైనప్పుడు మీరు జట్టు కోసం నిలబడి మ్యాచ్‌ను గెలిపించడం చాలా ముఖ్యం.'అని డొనోవన్ ఫెరీరా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications