వాడి బ్యాటింగ్ అద్భుతం.. ఎంజాయ్ చేస్తున్నా: యశస్వి జైస్వాల్
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ఆ జట్టు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రశంసల జల్లు కురిపించాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడాడు. నాన్‌స్ట్రైకర్‌గా అతని బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందని, అతను బంతిని బాదే తీరు అమోఘమని ప్రశంసించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన యశస్వి జైస్వాల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీని కొనియాడుతూ.. ఆకాశానికెత్తాడు.
బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతం..
'వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అద్భుతం. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా నచ్చింది. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. అతను బంతిని బాదే తీరును అవతలి ఎండ్‌లో నుంచి చూడటం నాకు ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. నేను సీనియర్ ఓపెనర్‌ను కాదు. నేను ఇంకా చాలా చిన్నవాడినే. కానీ నిజం చెప్పాలంటే.. చిన్నవయసులో వైభవ్ ఆడుతున్న తీరుకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు.

ఇది ఎక్కువ స్కోర్లు నమోదయ్యే మైదానమని మాకు తెలుసు. కాబట్టి మేం దూకుడుగా ఆడాలి. అవకాశం దొరికిన బంతిని బాదాలి. 220 ప్లస్ రన్స్ చేయాలి కాబట్టి మంచి ఆరంభం కావాలని అనుకున్నాం. బంతి నా రేంజ్‌లో ఉంటే బాదాలనే స్పష్టతో ఉన్నాను.
జట్టు అంతా బాగుంది..
అంతా చాలా బాగుంది. అందరూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉన్నారు. ప్రతిరోజూ అందరూ రాణించలేకపోవచ్చు. కానీ మాది చాలా మంచి జట్టు. ప్రాక్టీస్ సెషన్స్‌లో కష్టపడుతున్నాం. మా ప్రక్రియపై ఫోకస్ పెడుతున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాం. మా ఆటను ఆస్వాదిస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా బాగుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. అప్‌కమింగ్ మ్యాచ్‌ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం.
స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా. మైదానంలో ఆనందంగా ఆడుతున్నా. ఈ గేమ్ కూడా అలాగే ఉంటుంది. మా ఉద్దేశం ఎప్పుడూ పరుగులు సాధించడమే. ఇదే విషయాన్ని మేం డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా చెప్పుకుంటాం.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
యశస్వి హాఫ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. డోనోవన్ ఫెర్రెరియా(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/36) మూడు వికెట్లు తీయగా..అర్ష్‌దీప్ సింగ్(1/68) ఒక వికెట్ తీసారు. లాకీ ఫెర్గూసన్(0/57), అర్ష్‌దీప్ సింగ్ ధారళంగా పరుగులివ్వడం పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications