Riyan Parag: డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరేట్ తాగుతూ దొరికిపోయిన ఆటిట్యూడ్ స్టార్!(వీడియో)
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సందర్భంగా 16వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఔటై డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన వెంటనే వేపింగ్ చేస్తూ కనిపించాడు. వేపింగ్ అంటే.. ఈ సిగరెట్ తాగడం. డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేయడంపై ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేవు. కానీ భారత్‌లో ఈ సిగరెట్ల ఉత్పత్తుల వాడకంపై నిషేధం ఉంది. ఈ క్రమంలోనే అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
5 మ్యాచ్‌లు నిషేధం..?
స్టేడియాల్లో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి బీసీసీఐ కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తుంది. కానీ అందులో వేపింగ్‌కు సంబంధించిన నియమాలు పొందుపర్చలేదు. ఆరోగ్యం, భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్, డగౌట్‌లో పొగాకు సంబంధిత ఉత్పత్తుల వాడకంపై నిషేధం ఉంది. అయితే రియాన్ పరాగ్ ఈ సిగరేట్ కావడం వల్ల బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ వ్యవహారంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రియాన్ పరాగ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై భారీ శిక్ష పడే అవకాశం ఉంది. రియాన్ పరాగ్‌పై కనీసం నాలుగు నుంచి ఐదు మ్యాచ్‌ల నిషేధంతో పాటు భారీ జరిమానా కూడా విధించవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఆట తక్కువ.. ఎక్స్‌ట్రాలు ఎక్కువ..?
ఇప్పటికే రియాన్ పరాగ్‌కు ఆటిట్యూడ్ స్టార్ అనే చెడ్డ పేరు ఉంది. మైదానంలో అతను అతిగా ప్రవర్తిస్తాడని అభిమానులు రియాన్ పరాగ్‌ను అటిట్యూడ్ స్టార్ అంటూ ట్రోల్ చేస్తారు. ఈ సీజన్‌లో రియాన్ పరాగ్ రాణించింది కూడా ఏం లేదు. కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే రియాన్ పరాగ్.. ఫోజులు కొట్టడ తప్ప ఆడింది ఏం లేదని క్రిష్ శ్రీకాంత్ ఘాటుగా విమర్శించాడు. వీరేంద్ర సెహ్వాగ్ అయితే.. రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ అవసరమా? అని ప్రశ్నించాడు.
ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రియాన్ పరాగ్ 107 పరుగులే చేశాడు. ఇదే సీజన్‌లో గౌహతి స్టేడియం డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమి భిందర్‌కు లక్ష జరిమానా పడింది.
ఈ-సిగరెట్ అంటే ఏంటి?
ఇందులో పొగాకును కాల్చరు. బదులుగా ఒక బ్యాటరీ సాయంతో నికోటిన్, రుచికరమైన ఫ్లేవర్లు, ఇతర రసాయనాలు కలిగిన ద్రావణాన్ని వేడి చేస్తారు. అలా వేడెక్కినప్పుడు అది ఆవిరిగా మారుతుంది. వినియోగదారులు ఆ ఆవిరిని పీలుస్తారు. దీనినే "వేపింగ్" అంటారు. ఇవి చూడటానికి సాధారణ సిగరెట్ లేదా పెన్నుల రూపంలో ఉంటాయి.
ఎందుకు తాగుతారు..?
చాలా మంది సాధారణ సిగరెట్లకు బానిసలై, వాటిని మానేసే క్రమంలో దానికి ప్రత్యామ్నాయంగా ఈ-సిగరెట్లను వాడుతుంటారు. నికోటిన్ ఒత్తిడిని తాత్కాలికంగా తగ్గిస్తుందనే భావనతో ఈ-సిగరెట్లు తాగుతారు. అయితే ఈ సిగరెట్లు కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేకనే రియాన్ పరాగ్ వేపింగ్ చేసినట్లు అర్థమవుతుంది. అయితే ఐపీఎల్‌లో ఆటగాళ్లు వేపింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆరోన్ ఫించ్ కూడా వేపింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications