వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్
శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా అద్భుత బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. సమష్టిగా రాణించి విజయం సాధించామని తెలిపాడు.
మేం అనుకున్నట్లే ఆడాం..
'ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఒక జట్టుగా మేం ఏ విషయాల గురించి చర్చించుకున్నామో.. అవన్నీ ఈ మ్యాచ్‌లో అమలు చేశాం. పంజాబ్ కింగ్స్‌ను మరికొన్ని తక్కువ పరుగులకే కట్టడి చేయాల్సింది. కానీ బౌలర్ల లోటును మా బ్యాటర్లు పూడ్చారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఇంకొన్ని ఓవర్లు మెరుగ్గా ఆడి ఉండాల్సింది. ఏది ఏమైనప్పటికీ.. 40 ఓవర్ల పాటు అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే లక్ష్యంతోనే మేం బరిలోకి దిగుతాం.

జట్టు బయట ఉన్నవారికి మాత్రమే ఆందోళనలు ఉంటాయి. మాకు మా ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంది. మా జట్టులో ఎలాంటి కంగారు లేదు. వికెట్లు చేతిలో ఉంచుకుంటూనే రన్-రేట్ తగ్గకుండా చూసుకోవడమే మా ప్రణాళిక. మధ్యలో కొంచెం వెనుకబడినప్పటికీ.. తిరిగి పుంజుకుని మూమెంటం సాధించాం. శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా ఆడిన తీరు పంజాబ్ కింగ్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. వారు బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
సత్తా చాటిన ఫెరీరా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. డోనోవన్ ఫెరీరా(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/36) మూడు వికెట్లు తీయగా..అర్ష్‌దీప్ సింగ్(1/68) ఒక వికెట్ తీసారు. లాకీ ఫెర్గూసన్(0/57), అర్ష్‌దీప్ సింగ్ ధారళంగా పరుగులివ్వడం పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications