ఆ ఒక్క తప్పిదమే మా ఓటమికి కారణం: శ్రేయస్ అయ్యర్
ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోవడమే తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ముఖ్యంగా స్లోయర్ బాల్స్, యార్కర్లు వేయడంలో విఫలమయ్యామని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెత్త బౌలింగ్‌తో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కాపాడుకోలేకపోయింది.
బౌలింగ్ వైఫల్యమే..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. 'మేం 223 పరుగుల భారీ స్కోర్ చేశాం. ఇది డిఫెండ్ చేసుకోగల స్కోర్. బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. పిచ్ స్టిక్కీగా, స్లోగా ఉన్నా కూడా అసాధారణ ప్రదర్శనతో భారీ స్కోర్ అందించారు.
కానీ ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. ముఖ్యంగా స్లో బాల్స్, యార్కర్లు వేయాలని ప్లాన్ చేశాం. కానీ అలా జరగలేదు. మిడిల్ ఓవర్లలో ఫెరీరా, శుభమ్ దూబే కీలక భాగస్వామ్యంతో మా ఓటమిని శాసించారు.

పాపం బౌలర్లు..
ఈ ఫార్మాట్‌లో చాలా మంది బ్యాటర్లు తమ ఆటను మార్చుకున్నారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నారు. దాంతో బౌలర్లకు కష్టంగా మారింది. బౌలర్లు ఒక్క ప్రణాళికతో కాకుండా రెండు, మూడు ప్లాన్స్‌తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లాన్స్‌ను సమర్థవంతంగా అమలు చేయడం కూడా వారికి సవాల్‌గా మారింది. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేస్తే విజయం దక్కుతుంది. కానీ ఈ రోజు అది జరగలేదు.
ఈ మ్యాచ్‌లో ఓడినా మా దినచర్యలను కొనసాగిస్తాం. ప్రయాణాల వల్ల కాస్త అలసట ఉన్నా.. దాన్ని సాకుగా చెప్పలేం. కానీ మా తదుపరి మ్యాచ్‌కు కొన్ని రోజుల విరామం ఉంది. లోపాలను సరిదిద్దుకుని బలంగా తిరిగి వస్తాం.
ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం..
ఈ సీజన్‌లో మాకు ఎదురైన తొలి ఓటమి ఇది. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. మేం గతంలో 200కు పైగా పరుగులను ఛేదించాం. అలాగే డిఫెండ్ కూడా చేశాం. ఇది అనుకూలించని ఒక మ్యాచ్ మాత్రమే. దీన్ని పక్కనపెట్టి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం.
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టమైంది. ఎందుకంటే బంతి కొంచెం ఆగి, స్వల్పంగా టర్న్ అయింది. తొలి మ్యాచ్‌లోనే హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చి జట్టులోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అతని వైఖరికి హాట్సాఫ్. కొత్త వేదిక ధర్మశాల గురించి మాట్లాడేది ఏం లేదు. అక్కడ గెలవడమే మా లక్ష్యం'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
కొంపముంచిన అర్ష్‌దీప్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. డోనోవన్ ఫెర్రెరియా(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/36) మూడు వికెట్లు తీయగా..అర్ష్‌దీప్ సింగ్(1/68) ఒక వికెట్ తీసారు. లాకీ ఫెర్గూసన్(0/57), అర్ష్‌దీప్ సింగ్ ధారళంగా పరుగులివ్వడం పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications