Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: SRHతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు చావో రేవో!

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌కు చావో రేవో లాంటిది. ఇందులో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఈ సీజన్‌లో కూడా ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు కనుమరగవుతాయి.

ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచే జట్లే ప్లే ఆఫ్స్ చేరుతాయి. దాంతో ముంబై ఇండియన్స్ ఆడబోయే 7 మ్యాచ్‌లకు ఏడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం 6 మ్యాచ్‌లైనా గెలిస్తేనే ముంబై ఇండియన్స్‌కు టాప్-4 బెర్త్ ఖరారు అవుతుంది.

IPL 2026 Mumbai Indians Face Must-Win Clash Against SRH to Revive Playoff Hopes

ముఖాముఖి పోరు ఆరెంజ్ ఆర్మీదే..

మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబై ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. పేలవ బౌలింగ్‌తో ఆరంభంలో తడబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనామక బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో గెలుపుబాట పట్టింది. ఒకరిద్దరిపై కాకుండా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయాలు సాధిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబై ఇండియన్స్ ఓడించాలంటే.. అంతకుమించిన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాలి.

ఇప్పటి వరకు ఇరుజట్లు 34సార్లు తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 19, ముంబై ఇండియన్స్ 15 సార్లు గెలిచాయి. గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు.

తుది జట్లు(అంచనా)

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ/డానిష్ మలెవార్, క్వింటన్ డికాక్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్/కేశవ్ మహరాజ్, క్రిష్ భగత్, అశ్వని కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, అల్లా ఘజన్‌ఫర్

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగా, ప్రఫుల్ హింగే/హర్ష్‌దూబే, సాకిబ్ హుస్సేన్.

Story first published: Wednesday, April 29, 2026, 8:46 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+